మెగా ఫ్యామిలీ బెంగుళూరు వెళ్లేది అందుకేనా?
ఈ మధ్య కాలంలో చిరు-అల్లు అరవింద్ ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందని మళ్లీ మీడియాలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 July 2024 8:57 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్రతీ సంక్రాంతిని కుటుంబ సమేతంగా బెంగుళూరు ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుంటారు? అన్న సంగతి తెలిసిందే. కుమార్తెలు, అల్లుళ్లు, కుమారులు, కోడలు, అక్కలు, చెల్లెళ్లు, మేనల్లుళ్లు, అన్నదమ్ములందరితో కలిసి ప్రత్యేకంగా వేడుక చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఈ వేడుకలో కుదిరినప్పుడల్లా అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా పాల్గొంటుంది. సంక్రాంతి అంటే కుటుంబ సమేతంగా జరుపుకోవాల్సిన పండుగగా భావించి ప్రత్యేక శ్రద్దతో అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి బెంగుళూరు తీసుకెళ్తారాయన.
ఇప్పటివరకూ ఇలా అందరికీ తెలిసిన నిజమిది. కానీ ఇలా అందర్నీ కలపడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో చిరు-అల్లు అరవింద్ ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందని మళ్లీ మీడియాలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైకాపా అభ్యర్ధిని బలపరచడంతో రచ్చ ఏ రేంజ్ లో జరిగిందో విధితమే. తాజాగా ఈ వివాదంపై ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండే బన్నీవాస్ స్పందించారు.
'కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. నేను 20 ఏళ్ల నుంచి మెగా-అల్లు ఫ్యామిలీను దగ్గరగా చూస్తున్నాను. ఆరెండు కుటుంబాలు కలిసి ఉండాలని చిరంజీవి గారు ఎప్పుడూ తాపత్రయ పడతారు. అందుకోసమే ప్రతీ సంక్రాంతికి అందర్నీ బెంగుళూరు తీసుకెళ్తారు. అంత మందిని తీసుకెళ్లడం చిన్న విషయం కాదు. చాలా ఖర్చు అవుతుంది. దానికి కారణం అందరూ కలిసి ఉండాలి అనేది ఆయన కోరిక. ఇలా కలిసి ఉన్నామని చెప్పడం.
ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఇవి జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాంటివే. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. వాళ్లంతా కలిసి ఉండాలనే అంతా కోరుకునేది. వాటిని భూతద్దం పెట్టి చూడాల్సిన పనిలేదు' అని అన్నారు.