Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ కోసం ప్యారిస్‌కి మెగా ఫ్యామిలీ ఇంత‌లోనే

ఈ ఫ్యామిలీ ఫోటోలో అంద‌రినీ ఆక‌ర్షించిన ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారు. అది మ‌రెవ‌రో కాదు క్యూట్ బేబి క్లిన్ కారా

By:  Tupaki Desk   |   24 July 2024 3:59 PM GMT
ఒలింపిక్స్ కోసం ప్యారిస్‌కి మెగా ఫ్యామిలీ ఇంత‌లోనే
X

ప్యారిస్‌లో ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి తాను, తన కుటుంబం హాజరవుతున్నట్లు వెల్లడిస్తూ మెగాస్టార్ చిరంజీవి X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసారు. అంత‌కుముందు మెగా కుటుంబం లండన్‌లోని ఒక పార్క్‌లో ఇలా క‌నిపించారు. ఈ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు వైర‌ల్‌గా దూసుకెళుతోంది.

ఈ ఫ్యామిలీ ఫోటోలో అంద‌రినీ ఆక‌ర్షించిన ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారు. అది మ‌రెవ‌రో కాదు క్యూట్ బేబి క్లిన్ కారా. చిరంజీవి తన మనవరాలు క్లిన్ కారాను చ‌క్రాల ట్రాలీలో తీసుకుని వెళుతున్నారు. చిరు వెంట భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా నడుస్తూ క‌నిపించారు. లండన్‌లోని హైడ్ పార్క్‌లో తీసిన ఫోటో ఇద‌ని చిరంజీవి వెల్లడించారు. ``రేపు పారిస్‌కు వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్ వద్ద మా కుటుంబం.. గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాధిస్తున్నాను! ప్యారిస్ లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాం`` అని తెలిపారు. ఈ ఫోటోకి ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. క్లిన్ కారా ది లక్కీ వన్! అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా, ప్యారిస్‌లో కూడా మంచి వాతావరణం ఉంద‌ని మ‌రొక‌రు రాసారు.

ఇటీవ‌ల ఉపాస‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ!!` అంటూ చ‌ర‌ణ్ ప్రేమ‌గా చిలిపిగా వ్యాఖ్యానించారు. భార్య‌ను కూతురిలా ప్రేమ‌గా చూసుకునే త‌న స్వ‌భావాన్ని చెర్రీ బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల కుమార్తె ఎక్కువ‌గా చ‌ర‌ణ్ కి చేరువైపోయింది. క్లిన్ కారాను విడిచి చ‌ర‌ణ్ ఒక్క క్ష‌ణ‌మైనా ఉండ‌లేరు.

చిరంజీవి త‌దుప‌రి మల్లాది వశిష్ట తెర‌కెక్కించ‌నున్న `విశ్వంభర`లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ సహనటి. కునాల్ కపూర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. చిరంజీవి హిట్ చిత్రం ఇంద్ర (2002) ఆగస్టు 22న పుట్టినరోజు కానుక‌గా అభిమానుల కోసం థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది. శంకర్ గేమ్ ఛేంజర్‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య ఇందులో స‌హ‌న‌టులు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. బుచ్చి బాబు సనా, సుకుమార్ లతోను చ‌ర‌ణ్ ప‌ని చేయ‌నున్నారు.