Begin typing your search above and press return to search.

వీడియో: అందుకే మెగా ఫ్యామిలీ వెరీ స్పెష‌ల్

రామ్ చరణ్ -ఉపాసన దంప‌తులకు బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ జంట తమ బేబి గ‌ర్ల్ క్లిన్ కారా కొణిదెలతో కలిసి మొదటిసారి పండుగను జరుపుకున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2023 8:41 AM GMT
వీడియో: అందుకే మెగా ఫ్యామిలీ వెరీ స్పెష‌ల్
X

ప‌రిశ్ర‌మ‌లో మెగా కుటుంబానికి ఉన్న ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. కేవ‌లం ఆర్జ‌న‌లోనే కాదు, పండుగ‌లు, సాంప్ర‌దాయంగా సాగే ఉత్స‌వ‌ వేడుక‌ల్ని సెల‌బ్రేట్ చేయ‌డంలో, సామాజిక సేవ‌ల్లో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అయితే ఈసారి బ‌తుక‌మ్మ సంబ‌రాన్ని ఈ కుటుంబం ఇంకా చాలా ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంది.

రామ్ చరణ్ -ఉపాసన దంప‌తులకు బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ జంట తమ బేబి గ‌ర్ల్ క్లిన్ కారా కొణిదెలతో కలిసి మొదటిసారి పండుగను జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన వేడుక‌ల‌ నుండి ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంక్షిప్త వీడియోను షేర్ చేసారు. ఈసారి ఉత్స‌వాన్ని అనాధ పిల్ల‌ల న‌డుమ జ‌రుపుకోవ‌డం హృద‌యాల్ని హ‌త్తుకుంటోంది.

ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో ఈ వీడియోని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. బాలికా నిలయం సేవా సమాజ్ అనాథ శరణాలయంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. చిన్నారి క్లిన్ కారా నీలిరంగు దుపట్టాలో ఒదిగిపోయి ఉపాసన ఒడిలో ఉండ‌గా అంతా సంబ‌రాల్లో మునిగి తేలారు. వీడియోలో రామ్ చరణ్ - ఉపాసన పలువురు చిన్నారుల‌తో కలిసి బతుకమ్మ చుట్టూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో ఉపాసన, రామ్ చ‌ర‌ణ్ ఆ పిల్ల‌ల‌తో చాటింగ్‌ చేస్తూ కనిపించారు. ఇదే వీడియోలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించారు.

వీడియోను షేర్ చేస్తూ ఉపాసన క్యాప్షన్‌లో ఇలా రాశారు. ప్రజలు నాకు శక్తిని ఇస్తారు. నా కుటుంబం నాకు బలాన్ని ఇస్తుంది. దసరా ఈ పవిత్రమైన రోజున సానుకూలతను వ్యాప్తి చేయడానికి .. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మనలోని శక్తిని ఉద్దీప‌న చేద్దాం. ప్ర‌తిసారీ దసరాలో మా అమ్మమ్మగారు ఉండేవారు. ఆమెతో ఉత్సవం మా సజీవ సంప్రదాయం. ఇప్పుడు బాలికా నిలయం సేవా సమాజ్‌లో కుటుంబంతో ఇలా సెల‌బ్రేట్ చేసుకున్నాం... అని తెలిపారు. #హ్యాపీద‌స‌రా అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు.

ఉపాసన తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుమార్తె క్లిన్ కారాతో ఉన్న ఫోటోలను పంచుకుంటుంది. ఇంతకు ముందు గణేష్ చతుర్థి వేడుకలు, వరలక్ష్మి వ్రతం పూజ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల నుండి చిన్నారి క్లిన్ కారాతో వేడుక‌ల ఫోటోలను షేర్ చేసారు. జూలై 20న మామ్ గా తన మొదటి పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా ఉపాస‌న‌ తల్లి శోభనా కామినేని తన కుమార్తె, రామ్, క్లిన్‌ల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. హ్యాపీయెస్ట్ ఆఫ్ బర్త్ డే ఉప్సీ (ఉపాసన) అని దీనికి క్యాప్ష‌న్ ఇచ్చారు. అనాధ పిల్ల‌ల క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు ఇలా క్లిన్ కారాతో క‌లిసి బ‌తుక‌మ్మ సంబ‌రం జ‌రుపుకోవ‌డం వారి మంచి హృద‌యాన్ని, ఆద‌ర్శ జీవ‌నాన్ని, సేవాగుణాన్ని ఆవిష్క‌రిస్తోంది.