Begin typing your search above and press return to search.

మెగా హీరోలు.. ఇక ఆ పనుల్లో బిజీబిజీగా..

జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Jun 2024 6:19 AM GMT
మెగా హీరోలు.. ఇక ఆ పనుల్లో బిజీబిజీగా..
X

మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ ప్రస్తుతం హ్యాపీ మూడ్ లో ఉన్నారని చెప్పాలి. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచి రికార్డ్ సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళ రాజకీయ ప్రయాణానికి సరైన గౌరవం లభించింది. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీకి సంతోషాన్ని ఇచ్చే విషయాలే కావడం విశేషం.

ఇక ఈ సంతోష సమయాన్నిముగించుకొని మెగా హీరోలు అందరూ మళ్ళీ వారి వారి సినిమా షూటింగ్ లలో బిజీ అయ్యే పనిలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి స్టార్ట్ అయ్యింది. త్వరలో ఈ చిత్రీకరణ పూర్తి చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో విజయం కావడం అందరికంటే ఎక్కువ సంతోషించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని చెప్పొచ్చు.

ఇక రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ని రాజమండ్రిలో తాజాగా మొదలు పెట్టారు. దీని తర్వాత మరో షెడ్యూల్ తో గేమ్ చేంజర్ మూవీ ఆల్ మోస్ట్ పూర్తయిపోతుంది. రామ్ చరణ్ మీద కీలక సన్నివేశాలు రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించబోతున్నారు. విరూపాక్ష మూవీతో చివరిగా బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాడు.

హనుమాన్ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ నెల ఆఖరులో మూవీ స్టార్ట్ కాబోతుందంట. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా మూవీ చేస్తునాన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టబోతున్నారంట. వరుణ్ తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన వైష్ణవ తేజ్ తరువాత వరుసగా మూడు డిజాస్టర్ లు ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సారి ఎలా అయిన సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్న వైష్ణవ్ తేజ్ రెండు సినిమాలని లైన్ లో పెట్టాడంట. అందులో ఓ మూవీ ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరో రెండు నెలల్లో ఓజీ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.