Begin typing your search above and press return to search.

లండ‌న్ విహారంలో మెగా ఫ్యామిలీ మ‌రో కోణం

నిరంత‌ర బిజీ షెడ్యూళ్ల నుంచి కాస్తంత విరామం తీసుకుని లండ‌న్, ప్యారిస్ వినువీధుల్లో విహ‌రించేందుకు ప్లాన్ చేసారు చిరు-చ‌ర‌ణ్‌.

By:  Tupaki Desk   |   25 July 2024 3:09 PM GMT
లండ‌న్ విహారంలో మెగా ఫ్యామిలీ మ‌రో కోణం
X

నిరంత‌ర బిజీ షెడ్యూళ్ల నుంచి కాస్తంత విరామం తీసుకుని లండ‌న్, ప్యారిస్ వినువీధుల్లో విహ‌రించేందుకు ప్లాన్ చేసారు చిరు-చ‌ర‌ణ్‌. ఆ ఇద్ద‌రూ స‌తీస‌మేతులై తొలుత లండ‌న్ కి వెళ్లారు. అక్క‌డ విహార‌యాత్ర‌ను ముగించుకుని నేరుగా ప్యారిస్ కి బ‌య‌ల్దేరుతామ‌ని ఇంత‌కుముందే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌రంగా ఈ టూర్ ఆద్యంతం బుల్లి క్లిన్ కారా తాత‌య్య- డాడీ వెంటే ఉంటూ అంద‌రి కంటా ప‌డుతోంది. ఉపాస‌న క్ష‌ణ‌మైనా వీడ‌కుండా గారాల ప‌ట్టీ క్లిన్ కారా కోసం జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

లండ‌న్ ట్రిప్ నుంచి ఇంత‌కుముందే ఒక క్లాసిక్ అన‌ద‌గ్గ ఫోటో విడుద‌లైంది. లండ‌న్ లోని పాపుల‌ర్ పార్క్ నుంచి అంద‌మైన ఫోటో వైర‌ల్ అయింది. ఇప్పుడు అదే లండ‌న్ వీధులలో విహ‌రిస్తున్న మ‌రో ఫోటోగ్రాఫ్ ని చిరంజీవి షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ లో చిరు, చ‌ర‌ణ్ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నారు. ఆ ఇద్ద‌రి అవ‌తార్ లు ఎంతో సాఫ్టా గా ఫార్మ‌ల్ గా క‌నిపిస్తున్నాయి. వారితో పాటు శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల‌, ఉపాస‌న కొణిదెల కూడా లండ‌న్ లో విహ‌రిస్తూ ఆస్వాధ‌న‌ల్లో ఉన్నారు. ఇలాంటి విలువైన స‌మ‌యం గ‌డిపేందుకు దంప‌తుల‌కు అవ‌కాశం రావ‌డం అరుదు. కానీ దానిని మెగా దంప‌తులు ఎంతో ఉల్లాసంగా ఆస్వాధిస్తున్నారు.

సినిమాలతో ఎప్పుడు బీజీగా ఉండే మెగా ఫ్యామిలీ ఇలాంటి ట్రిప్స్ తో ఎంతో ఎగ్జ‌యిట్ అవ్వ‌డం చూసిన అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జులై 26 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్ ని చూసేందుకు మెగా టూర్ ప్లాన్ చేసామ‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిన‌దే. టూర్ ముగించి తిరిగి వ‌చ్చాక చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ గురించి, చిరు విశ్వంభ‌ర గురించి సీరియ‌స్ గా ఆలోచిస్తారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల కానున్నాయి.