Begin typing your search above and press return to search.

ఇక మెగా ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు

మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ గా అల్లు అర్జున్ పుష్ప ది రూల్. గేమ్ చేంజర్, విశ్వంభర ఉన్నాయి.

By:  Tupaki Desk   |   22 July 2024 9:49 AM GMT
ఇక మెగా ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు
X

మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ గా అల్లు అర్జున్ పుష్ప ది రూల్. గేమ్ చేంజర్, విశ్వంభర ఉన్నాయి. వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. మిగిలిన సినిమాలు మాత్రం కాస్తా ఎర్లీగానే రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.

ఈ ఏడాది ఆఖరులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 6న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రం రాబోతోంది. దీని తర్వాత మూడు వారల గ్యాప్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవ్వబోతోంది. తాజాగా దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్ కి వస్తుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఒకే నెలలో ఇద్దరు మెగా హీరోల సినిమాలు సందడి చేయబోతున్నారు. మళ్ళీ రెండు వారల గ్యాప్ లోనే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వబోతోంది.

మెగాస్టార్ నుంచి భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనుంది. అంటే కరెక్ట్ గా చూసుకుంటే నెల రోజుల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీ నుంచి మూడు పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు దేనికవే ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. కచ్చితంగా వీటిలో ఒక్క సినిమా అయిన వండర్స్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

పుష్ప ది రూల్ మూవీ పైన పబ్లిక్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అయితే పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ రాబోతోంది. అందుకే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా గేమ్ చేంజర్. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు మెజారిటీగా కమర్షియల్ జోనర్ సినిమాలు చేస్తూ వచ్చారు. వాటిలో వాల్తేరు వీరయ్య మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే విశ్వంభర మూవీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే సోషియో ఫాంటసీలో విశ్వంభర మూవీ కథని వశిష్ట మల్లిడి చెప్పబోతున్నాడు.