Begin typing your search above and press return to search.

పవన్ తో కొణిదెల.. ఏమైనట్టు..?

ఐతే కొణిదెల ప్రొడక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశ పడ్డారు. రాం చరణ్ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు.

By:  Tupaki Desk   |   24 July 2024 3:43 AM GMT
పవన్ తో కొణిదెల.. ఏమైనట్టు..?
X

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ టైం లో కొణిదెల ప్రొడక్షన్ అని ఒకటి మొదలు పెట్టి చిరు ఇక మీదట తన సినిమాలన్నీ ఇందులోనే చేస్తాడన్నట్టు చెప్పుకొచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్ ని చరణ్ చూసుకుంటున్నాడు. ఐతే రీ ఎంట్రీ తర్వాత చిరుతో దాదాపు 3, 4 సినిమాలు చేశారు. సైరా నరసింహా రెడ్డి కూడా ఆ బ్యానర్ నుంచి వచ్చిందే. ఐతే ప్రొడక్షన్ అంటే హీరోగా చేసినట్టు కాదని మెగా ఫ్యామిలీకి అర్థమైంది. అందుకే కొన్నాళ్లు ప్రొడక్షన్ ని పక్కన పెట్టేద్దాం అనుకున్నారు.

ఐతే కొణిదెల ప్రొడక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశ పడ్డారు. రాం చరణ్ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు. రాం చరణ్ కి కూడా ఆ ఆలోచన బలంగా ఉన్నా పరిస్థితులు అనుకూలించక ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ ప్రస్తుతం సినిమాలు చేయకపోవచ్చు కానీ మళ్లీ అది మొదలు పెడితే ఇక ఆగేది ఉండదని అంటున్నారు.

ఐతే ఆల్రెడీ కొణిదెల బ్యానర్ ఉన్నా కూడా చరణ్ యువి క్రియేషన్స్ లో ఉన్న విక్రం తో కలిసి V మెగా అనే మరో బ్యానర్ మొదలు పెట్టాడు. ఐతే కొణిదెల ప్రొడక్షన్ భారీ సినిమాలను చేయాలని అనుకుంటుండగా V మెగా బ్యానర్ లో మాత్రం లిమిటెడ్ బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా అబాయ్ నిర్మాణంలో బాబాయ్ చేయాలి అందులో చరణ్ కూడా ఒక చిన్న క్యామియో చేయాలని మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో హీరోగా బిజీ బిజీగా ఉంటున్న చరణ్ ప్రొడక్షన్ నడిపించడం రిస్క్ తో కూడుకున్న పనే. సినిమా నిర్మాణం అనేది డబ్బులతో కూడుకున్న పని అది వేరే వాళ్ల చేతుల్లో పెట్టలేరు. అందుకే చరణ్ ప్రస్తుతానికి కొణిదెల ప్రొడక్షన్స్ ని ఆపి ముందు కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఆ బ్యానర్ ని ముందుకు నడిపించే ప్లాన్ చేస్తాడని తెలుస్తుంది. చరణ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలే కానీ కొణిదెల బ్యానర్ లో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మల్టీస్టారర్ ఫిక్స్ చేయొచ్చు. మరి అలాంటి సినిమా ప్రకటించే రోజు కోసం మెగా ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచే దాకా ఎదురుచూస్తున్నారు.