Begin typing your search above and press return to search.

పుష్ప2 తో...పవన్ పోటీగా వస్తే..?

అయితే అన్నిటికంటే ముఖ్యంగా డిసెంబర్ నెలలో టాలీవుడ్ లో టైట్ ఫైట్ ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   1 July 2024 4:02 AM GMT
పుష్ప2 తో...పవన్ పోటీగా వస్తే..?
X

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రాబోతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాల రిలీజ్ ఉన్నాయి. ప్రతి సినిమా కూడా భారీ అంచనాల మధ్యనే రిలీజ్ కాబోతోంది. అలాగే స్టార్ హీరోల చిత్రాలే చాలా వరకు ఉండటం విశేషం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా డిసెంబర్ నెలలో టాలీవుడ్ లో టైట్ ఫైట్ ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

ఆ నెలలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో మూడు సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు నితిన్ రాబిన్ హుడ్, నాగ చైతన్య పాన్ ఇండియా మూవీ తండేల్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్నాయి.

మరోవైపు డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ 20-25 రోజుల కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని అన్నారు. అమెజాన్ ప్రైమ్ తో డిజిటల్ రైట్స్ కోసం జరిగిన ఒప్పందంలో అక్టోబర్ చెప్పామని, అయితే డిసెంబర్ వరకు గడువు అడుగుతామని ఏఎం రత్నం చెప్పారు.

దీనిని బట్టి హరిహరవీరమల్లు ఆల్ మోస్ట్ డిసెంబర్ లో రావడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప2కి పోటీగా డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. అదే సమయంలో రాకపోవచ్చు గాని, ఒక వారం అటు ఇటు అయినా బాక్సాఫీస్ వద్ద ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అదే జరిగితే రెండు పెద్ద సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఇండస్ట్రీకి అంత శ్రేయస్కరం కాదనే మాట వినిపిస్తోంది.

పొలిటికల్ వేడి గురించి అందరికి తెలిసిందే. అలా కూడా అల్లు అర్జున్ సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. అంటే ముగ్గురు మెగా హీరోల సినిమాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకి వస్తాయని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్ కి ఇది సంతోషకరమైన న్యూస్ అనుకున్న పవర్ స్టార్, ఐకాన్ స్టార్ మధ్య పోటీ అంటే కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప2, హరిహర వీరమల్లు మధ్య పోటీ లేకుండా సమస్యని పరిష్కరించుకుంటారా లేదా అనేది చూడాలి.