Begin typing your search above and press return to search.

మెగా హీరోకు ఫోన్ చేసి 5 లక్షలు అడిగిన హీరో

ఎవరికైనా సాయం అంటే ముందు వరుసలో ఉండే ఈ జెనరేషన్ హీరోలని చూసుకుంటే అందులో మంచు మనోజ్ కనిపిస్తాడు

By:  Tupaki Desk   |   28 March 2024 3:58 AM GMT
మెగా హీరోకు ఫోన్ చేసి 5 లక్షలు అడిగిన హీరో
X

ఎవరికైనా సాయం అంటే ముందు వరుసలో ఉండే ఈ జెనరేషన్ హీరోలని చూసుకుంటే అందులో మంచు మనోజ్ కనిపిస్తాడు. అతను సినిమాలు ఫెయిల్ అయిన కూడా సోషల్ యాక్టివిటీస్, తన మాటలతో అభిమానులను పెంచుకున్నాడు. చాలా కాలం నుంచి మంచు మనోజ్ హీరోగా సినిమా రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా నిత్యం మనోజ్ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటున్నారు.

మంచు మనోజ్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వైజాగ్ హుద్ హుద్ సమయంలో స్వయంగా తనే వచ్చి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. కరోనా సమయంలో కూడా పెద్ద మనసు చాటుకున్నాడు. ఎప్పటికప్పుడు తన గొప్ప మనసుని మనోజ్ చూపించుకుంటూనే ఉంటాడు. తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దుబాయ్ లో ఓ ఆడపిల్ల ఇబ్బందుల్లో ఉందని నాకు తోచిన సహాయం చేసాను.

అయితే ఆమెకి కావాల్సిన ఎమౌంట్ లో ఓ 5 లక్షల వరకు తగ్గాయి. ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలా అని ఆలోచించాను. వెంటనే రామ్ చరణ్ గుర్తుకొచ్చి ఫోన్ చేసి ఇలా అర్జెంట్ గా ఓ ఆడపిల్ల కష్టాల్లో ఉంది సాయం కావాలి అని అడిగాను. 5 లక్షల అడ్జెస్ట్ చేయమని కోరాను. వెంటనే అకౌంట్ నెంబర్ పెట్టమని చెప్పి క్షణాల్లో 5 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. సాయం చేయడంలో చరణ్ ఎప్పుడు ముందుంటాడు. ఈ విషయం చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అతని గొప్ప వ్యక్తిత్వం ఏంటో చెబుతున్న అంటూ మనోజ్ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం అంటే ముందుంటాడు. సినిమాలతో తాను సంపాదించిన డబ్బులు పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రజలకి సేవ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవికి కూడా సేవాగుణం ఎక్కువ. ఎంతో మందికి తనకి తోచిన స్థాయిలో సాయం చేస్తూనే ఉంటారు.

తండ్రి, బాబాయ్ తరహాలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లో కూడా అలాంటి సేవా తత్పరత ఉందని, సాయం అడిగితే క్షణాల్లో చేసే గుణం ఉందని మంచు మనోజ్ మాటల బట్టి స్పష్టం అవుతోంది. మంచు మనోజ్ కి కూడా పవన్ కళ్యాణ్, చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానం మంచు మనోజ్ చూపించుకుంటూనే ఉంటాడు. చరణ్ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పడంతో మంచు మనోజ్ మెగా ఫ్యాన్స్ అభిమానం సొంతం చేసుకున్నాడనే మాట సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తోంది.