Begin typing your search above and press return to search.

మెగా సినిమాకు అంతా సిద్ధం.. పర్ఫెక్ట్ ప్లాన్..!

కామెడీ ఎంటర్టైన్ సినిమాలు చేయడంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న అనిల్ రావిపుడి చిరుతో కూడా ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

By:  Tupaki Desk   |   30 Nov 2023 2:30 AM GMT
మెగా సినిమాకు అంతా సిద్ధం.. పర్ఫెక్ట్ ప్లాన్..!
X

మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగా మూవీ కోసం ఇద్దరు ముగ్గురు దర్శకులు ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపుడి కూడా ఉన్నారు. రీసెంట్ గా బాలకృష్ణతో భగవంత్ కేసరి హిట్ అందుకున్న అనిల్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. రాజమౌళి తర్వాత తీసిన సినిమాలన్నీ హిట్ అందుకోవడంతో టాలీవుడ్ హిట్ మిషన్ గా అనిల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

భగవంత్ కేసరి తర్వాత రవితేజతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ లో ఉంది. చిరు కోసం అనిల్ ఒక మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రెడీ చేశాడట. ఈ మధ్యనే చిరుని కలిసి కథ వినిపించాడట అనిల్ రావిపుడి. చిరుకి కథ నచ్చిందని టాక్. వశిష్ట సినిమా పూర్తి కాగానే అనిల్ తోనే చిరు సినిమా చేస్తారని తెలుస్తుంది.

కామెడీ ఎంటర్టైన్ సినిమాలు చేయడంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న అనిల్ రావిపుడి చిరుతో కూడా ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. చిరంజీవి చంటబ్బాయ్ రిఫరెన్స్ తో అలాంటి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ లతో సినిమాలు చేసిన అనిల్ రావిపుడి ఇప్పుడు చిరుతో కూడా సినిమాకు రెడీ అవుతున్నాడు. మెగా 156 సినిమా సగం పూర్తయ్యాక ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపుడి కాంబో సినిమాను దిల్ రాజు నిర్మిస్తారట. అనిల్ చేసిన 7 సినిమాల్లో దాదాపు నాలుగు ఐదు సినిమాలు దిల్ రాజు నిర్మించారు. అనిల్ తో సినిమా చేస్తే హిట్ పక్కా అనే టాక్ వచ్చేసింది. అందుకే హీరోలు, నిర్మాతలు అనిల్ రావిపుడి తో సినిమాకు ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు. రవితేజతో చేసే సినిమా కూడా రాజా ది గ్రేట్ సీక్వెల్ అని టాక్. ఆల్రెడీ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీయడం మన వాళ్లకు అలవాటే. మరి రాజా డబుల్ గ్రేట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. పటాస్ టు భగవంత్ కేసరి డైరెక్టర్ గా అనిల్ తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. జక్కన్న తర్వాత ఓటమి లేని డైరెక్టర్ గా అనిల్ తన పంథా కొనసాగిస్తున్నారు. ఇదే ఫాం మునుముందు కూడా కొనసాగించాలని ఆడియన్స్ కోరుతున్నారు.