Begin typing your search above and press return to search.

చిరంజీవి, పవన్, చరణ్.. హరీశ్ పాన్ ఇండియా ప్లాన్స్!

మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కోసం ఓ స్టోరీ లైన్ అనుకున్నానని హరీష్ శంకర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 July 2024 3:14 PM GMT
చిరంజీవి, పవన్, చరణ్.. హరీశ్ పాన్ ఇండియా ప్లాన్స్!
X

ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న భారీ కథలతో సినిమాలు చేస్తూ.. తెలుగులోనే కాకుండా, ఇతర భాషల ఆడియన్స్ ను కూడా ఆకట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్ లాంటి పలువురు దర్శకులు మాత్రం ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకు పరిమితమయ్యే సినిమాలు చేస్తున్నారు. ఇదే విషయం మీద హరీష్ తాజాగా స్పందిస్తూ.. పాన్ ఇండియా అని ప్లాన్ చేసుకుంటే రాదని, మనం ఒక సినిమా చేస్తే అది పాన్ ఇండియా అవ్వాలని అన్నారు.

ఒక పెద్ద స్పాన్ ఉన్న స్టోరీ రాయాలని కూర్చోలేమని, అది సహజ సిద్ధంగా కథలో రావాలని హరీశ్ శంకర్ అభిప్రాయ పడ్డారు. ఇండియా - పాకిస్తాన్ బార్డర్ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడో ఓ లవ్ స్టోరీ రాసుకున్నానని, ఫుల్ ప్లెడ్జ్ గా చేస్తే అది పెద్ద స్పాన్ ఉన్న కథ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురికి సంబంధించి ఓ లైన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నానని హరీశ్ తెలిపారు. ఆ కథ మీద వర్క్ చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పెద్ద పాన్ ఇండియా అవుతుందని చెప్పారు.

పాన్ ఇండియా అని ప్లాన్ చేసుకుంటే రాదని, సహజ సిద్ధంగా వస్తేనే కథలో ఆ భారీతనం వస్తుందని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి పాన్ ఇండియా సినిమా మాత్రమే చెయ్యాలని అడిగే హీరో ఎవరూ ఉండరన్నారు. 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలని అనుకోలేదని, అది పాన్ ఇండియా అయిందని.. ఇప్పుడు 'పుష్ప 2' ను పాన్ ఇండియా చెయ్యడం మార్కెటింగ్ స్ట్రాటజీ అని దర్శకుడు అన్నారు. కన్నడ నేటివిటీకి తగ్గట్టుగా తీసిన 'కాంతారా' సినిమాని అందరూ యాక్సెప్ట్ చేయడంతో పాన్ ఇండియా అయిందని చెప్పారు.

మనం తెలుగులో తీసే సినిమా పాన్ ఇండియా అవ్వాలని, మన కథనే దేశ వ్యాప్తంగా చెప్పాలని హరీష్ శంకర్ అన్నారు. 'నాటు నాటు'కు హలీవుడ్ ఊగిపోయినప్పుడు, పచ్చి మిరపకాయి జొన్న రొట్టె లాంటి లిరిక్స్ తో రాసిన పాట ఆస్కార్ తెచ్చినప్పుడు.. మన దేశానికి మన కథను ఎందుకు చెప్పలేమని అన్నారు. ఏదైనా మెటీరియలైజ్ అయిన తర్వాత చెప్తేనే బాగుంటుందని.. నెక్స్ట్ నాది పాన్ ఇండియా సినిమా, 300 కోట్ల బడ్జెట్ సినిమా లాంటి కబుర్లు చెప్పడం తనకు నచ్చదని దర్శకుడు చెప్పుకొచ్చారు.

మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కోసం ఓ స్టోరీ లైన్ అనుకున్నానని హరీష్ శంకర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. RRR తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలను ఓకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చి విజయం సాధించారు ఎస్.ఎస్. రాజమౌళి. ఇదే విధంగా డైరెక్టర్ హరీశ్ శంకర్ రానున్న రోజుల్లో మెగా మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.