Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ పార్టీకి జ‌న‌సేన- టీడీపీ నాయ‌కులు?

ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు ప్ర‌భావం మెగా ప్రిన్స్ వెడ్డింగ్ లో ప్ర‌స్ఫుటం కానుంద‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 7:03 AM GMT
మెగా ప్రిన్స్ పార్టీకి జ‌న‌సేన- టీడీపీ నాయ‌కులు?
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి బాజా మోగ‌నుంది. నేటి నుంచి ప్రీవెడ్డింగ్ వేడుక‌లు ఇట‌లీ టుస్కానీలోని వెడ్డింగ్ వెన్యూ- బార్గో సాన్ ఫెలిస్ రిసార్ట్ లో ప్రారంభ‌మ‌య్యాయి. 31న మెహందీ, హ‌ల్దీ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాతి రోజు కాక్ టైల్ పార్టీ ఉంటుంద‌ని స‌మాచారం.

నవంబర్ 1న టుసానిలోని బార్గో సాన్ ఫెలిప్ రిసార్ట్ లో పెళ్లి వేడుక‌లు వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నాయి. అనంత‌రం నవంబర్ 5న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ రిసెప్ష‌న్ కి కేవ‌లం సినీప్ర‌ముఖులు మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కులు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు ప్ర‌భావం మెగా ప్రిన్స్ వెడ్డింగ్ లో ప్ర‌స్ఫుటం కానుంద‌ని తెలిసింది. ఈ వేడుక‌ల‌కు జ‌న‌సేన నాయ‌కులు, కీల‌క వ్య‌క్తుల‌తో పాటు, అటు తెలుగు దేశం పార్టీ పెద్ద‌లు కూడా విచ్చేస్తార‌ని గుస‌గుస వినిపిస్తోంది. వీరంద‌రి కోసం నాగ‌బాబు అండ్ కో భారీ ఏర్పాట్లు చేయ‌నున్నార‌ట‌.

ఇప్ప‌టికే చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు కుటుంబ స‌మేతంగా ఇట‌లీ టుస్కానీలోని వెన్య వ‌ద్ద‌కు చేరుకున్నారు. అల్లు కుటుంబం నుంచి పెద్ద‌లు ఈ వేడుక‌కు విచ్చేసారు. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య స్నేహితులు కూడా అటెండ‌వుతున్నార‌ని స‌మాచారం.

క్లిన్ క్లారా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌: ఈ పెళ్లిలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వార‌సురాలు క్లిన్ కారా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. ఉపాస‌న స‌హా క్లిన్ కారా ఇప్ప‌టికే వెన్యూ వ‌ద్ద‌నే ఉంది. ప్ర‌స్తుతం వార‌సురాలి ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ ముఖాన్ని ఎమోజీలతో దాచాలని ఉపాస‌న‌ నిర్ణయించుకున్నారు. ఇది చాలా స‌ర‌దా వ్యాప‌కం.

కానీ ఆన్‌లైన్ లో అభిమాన సంఘాలు వెంట‌నే ఈ రహస్యాన్ని గుర్తించాయి. పూల్‌లో మెగా ప్రిన్సెస్ ప్రతిబింబాన్ని ఫ్యాన్స్ క‌నిపెట్టేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. క్లిన్ కారా క్యూట్ లుక్‌ని మెచ్చుకుంటూ మెగా అభిమానులు ఈ మంత్రముగ్ధులను చేసే ఫోటోని వైరల్ చేస్తున్నారు. క్లిన్ కారా చేరిక‌ టుస్కాన్ వేడుకకు మరింత అందం తెచ్చింది. అయితే మెగా కుటుంబం ఆమె ఫోటోను అధికారికంగా విడుదల చేస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.