Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకోవాలని ఉంది కాని...!

తాజాగా ఒక చిట్ చాట్‌ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పెళ్లి గురించి, ప్రేమ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:42 AM GMT
హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకోవాలని ఉంది కాని...!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహ నిశ్చితార్థం ఇప్పటికే జరిగింది. వీరి వివాహం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఒక చిట్ చాట్‌ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పెళ్లి గురించి, ప్రేమ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమయంలోనే పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మా పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్‌ లో ఉండవచ్చు. పెళ్లి హైదరాబాద్ లో చేసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ పెళ్లి జరిగితే ప్రైవేట్‌ కార్యక్రమం అన్నట్లుగా ఉండదు. మా పెళ్లిని ఒక ప్రైవేట్‌ కార్యక్రమంగా జరుపుకోవాలని భావిస్తున్నాం. అందుకే ఇక్కడ పెళ్లి చేసుకోవడం లేదని వరుణ్ పేర్కొన్నాడు.

పెళ్లి విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్ కు ప్లాన్‌ చేస్తున్నాం. దేశంలోని మూడు నాలుగు ముఖ్య ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. అతి త్వరలోనే ఒక ప్రాంతాన్ని ఫిక్స్ చేస్తామని కూడా వరుణ్ తెలియజేశాడు. పెళ్లి కి సంబంధించిన షాపింగ్ ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయని వరుణ్‌ పేర్కొన్నాడు.

ఇండియాలో వీలు పడకుంటే విదేశాల్లో అయినా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లుగా వరుణ్‌ తెలియజేశాడు. ఇక ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ అయిదు సంవత్సరాలుగా తాము రిలేషన్ లో ఉన్నట్లుగా పేర్కొన్నాడు. తమ విషయం బయటకు రివీల్ అయితే చిన్న చిన్న గొడవలు మా మధ్య వస్తాయేమో అనే ఉద్దేశ్యంతో రహస్యంగా ఉంచినట్లుగా చెప్పాడు.

ప్రస్తుతం వరుణ్‌ నటించిన గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.