అన్నయ్య హృదయాన్ని టచ్ చేసిన తమ్ముడు
'కృతజ్ఞతలు కళ్యాణ్ బాబు. నీ వ్యాఖ్యలు నా హృదయాన్ని..మనసుని తాకాయి' అంటూ నవ్వుతోన్న ఏమోజీని పోస్ట్ చేసారు.
By: Tupaki Desk | 23 Aug 2023 5:51 AM GMTమెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టిన రోజు వేడుకలు నిన్నటి రోజున ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు..సెలబ్రిటీలు..రాజకీయ ప్రముఖులు.. సన్నిహితు లు.. స్నేహితులు..కుటుంబ సభ్యులు విషెస్ తెలియజేసారు. ఇలా ఎంతమంది శుభాకాంక్షలు తెలిపినా తమ్ముడు పవన్ కళ్యాణ్ విషెస్ మాత్రం అన్నయ్య హృదయాన్ని తాకాయి.
'లక్షలాది మందకి స్పూర్తిగా నిలిచిన అన్నయ్య సంకల్పం..పట్టుదల..శ్రమ..నీతి నిజాయితీ..సేవాభావం తనలాంటి ఎందరికో ఆదర్శం. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అనయ్యా అని పిలిచే అదృష్టం కలిగించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ క్రమంగా మహానదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంది. మీరు ఎదిగి..మేము కూడా ఎదిగేందుకు ఓమార్గం చూపడమే కాకుండా... లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచారు.
కోట్లాది మంది అభిమానులున్నా మీలో గర్వం మాత్రం కూడగట్టుకోలేదు. అందుకు మీరు మలుచుకున్న తీరే కారణం. వన్నె తగ్గని అభినయ కౌశలంతో సినీ రంగంలో అప్రతీహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరం అంటూ పవన్ విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ్ముడికి అన్నయ్య ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేసారు. 'కృతజ్ఞతలు కళ్యాణ్ బాబు. నీ వ్యాఖ్యలు నా హృదయాన్ని..మనసుని తాకాయి' అంటూ నవ్వుతోన్న ఏమోజీని పోస్ట్ చేసారు.
దీంతో మెగా-జనసేన అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. పొలిటికల్ సినారేలో భాగంగా అన్నదమ్ముల మధ్య మాటలు లేవని చాలా కాలం ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. వాటికి ఎప్పటికప్పుడు అన్నద మ్ములిద్దరు బ్రేకులు వేసినా ప్రచారం మాత్రం ఆగలేదు. ఇటీవలే ఏపీ రాజకీయాల్సి ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యం....తాజాగా అన్నయ్యపై తమ్ముడి విషెస్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.