Begin typing your search above and press return to search.

తండ్రి వర్ధంతి వేడుక‌లో మెగాస్టార్ & ఫ్యామిలీ

ఆయ‌న తన మనోభావాలను వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌లో ''జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..'' అని రాసారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 12:48 PM GMT
తండ్రి వర్ధంతి వేడుక‌లో మెగాస్టార్ & ఫ్యామిలీ
X

ఈరోజు టాలీవుడ్ అగ్ర‌న‌టుడు, మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్ రావు వర్ధంతి. ఈ సందర్భంగా చిరు ఆయ‌న సోద‌రులు తన స్వగృహంలో తండ్రి జ్ఞాపకార్థం ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబు తన జీవిత భాగస్వామితో కలిసి పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.

ఈ ప్ర‌త్యేక నివాళి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. ఆయ‌న తన మనోభావాలను వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌లో ''జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..'' అని రాసారు. చిరంజీవి తండ్రి వెంక‌ట‌రావు కొణిదెల కానిస్టేబుల్. ఉద్యోగ‌రీత్యా నాన్న‌గారు పలు చోట్ల‌కు బ‌దిలీ అయ్యేవార‌ని, అలా త‌న స్ట‌డీస్ ఒకే చోట జ‌ర‌గ‌లేద‌ని చిరు తెలిపారు. త‌న తండ్రితో చిరంజీవి ప్ర‌త్యేక అనుబంధాన్ని క‌లిగి ఉన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో న‌టిస్తున్నారు. త‌దుప‌రి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో కలిసి పని చేయబోతున్నాడు. ఇది ఇటీవల అధికారికంగా ప్రకటించారు. న‌వ‌త‌రం హీరోలతో పోటీప‌డుతూ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ చిరు ఏజ్ లెస్ స్టార్ గా కొన‌సాగుతున్నారు.