చందమామ కథలా మెగాస్టార్ 156!
ఈ నేపథ్యంలో సోషియా ఫాంటసీ టచ్ ఇవ్వాలన్నా! చాలా మంది మేకర్స్ ఆలోచిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Jan 2024 7:25 AM GMTతెలుగులో సరైన సోషియా ఫాంటసీ చిత్రాలొచ్చి చాలా కాలమవుతోంది. కొంత కాలంగా ట్రెండ్ సస్పెన్స్ థ్రిల్లర్..యాక్షన్ థ్రిల్లర్ లదే కావడంతో! కంటెంట్ ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఓటీటీలో కూడా అలాంటి కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటడంతో మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషియా ఫాంటసీ టచ్ ఇవ్వాలన్నా! చాలా మంది మేకర్స్ ఆలోచిస్తున్నారు.
సోషల్ ఫాంటసీలో ఎక్కడ చిన్న తప్పు జరిగినా డ్యామేజ్ అలాగే ఉంటుంది. అందుకే సోషియా ఫాంటసీని టచ్ చేయడం అన్నది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందులోనూ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి చందమామ లాంటి కథ చెప్పాలంటే ధైర్య సాహసాలుండాలి. అలాంటి ప్రయత్నమే యువ దర్శకుడు వశిష్ట చేస్తున్నట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 156వ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
కాన్సెప్ట్ ఎలా ఉంటుందన్నది తెలియదు గానీ ఇది ఓ చందమామ కథలో అంద్భుతంగా ఉంటుందని.. ప్రేక్షకుల ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్న సినిమా అని అంటున్నారు. చిరంజీవికి సైతం ఇందులో పాత్ర సవాల్ విసురుతుందని...ఆ రేంజ్ లో హీరో పాత్రని వశిష్ట డిజైన్ చేసినట్లు..అందుకు చిరంజీవి ప్రత్యేకంగా సన్నధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చిరంజీవి ఆహార్యం సహా ప్రతీది చాలా కొత్తగా ఉంటుందని.. సినిమాలో వాడే ప్రతీ నటుడి కాస్ట్యూమ్స్ అన్నీ కొత్త గా ఉంటాయని అంటున్నారు.
సినిమా కోసం అత్యుత్తమ టెక్నాలజీని వినియోగిస్తున్నారుట. సీజీ పరంగా రిచ్ గా ఉండేలా ఓ పెద్ద కంపెనీతో ఒపందం చేసుకున్నట్లు వినిపిస్తుంది.ఈసినిమాకి విశ్వంభర అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక సోషియా ఫాంటసీ సినిమాలు చిరంజీవికి కొత్తేం కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి.. యముడుకి మొగుడు.. అంజి లాంటి సినిమాలు సోషియా ఫాంటసీ టచప్ ఉన్న చిత్రాలే. అవన్నీ మెగాస్టార్ ని వెండి తెరపై కొత్తగా ఆవిష్కరించినవే.