రిలవెంట్ గా ఉందనే ఆపని చేసా! చిరంజీవి
అయితే ఇది ఇప్పటి వీడియో కాదు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం షూట్ చేసిన వీడియో. అప్పుడు చిరంజీవి సామాజిక దృక్ఫధంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు.
By: Tupaki Desk | 1 May 2024 6:43 AM GMT''తల్లి, బిడ్డను మంచం మీద కూర్చోబెట్టుకుని చదువు చెబుతుంది. ఆ బిడ్డ ఎంతో శ్రద్దతో తల్లి చెప్పింది చేస్తుంది. ఆ పక్కనే కింద పని మనిషి తన కుమార్తె తో కలిసి అంట్లు తొముతుంటారు. పొరపాటున చేయి జారి తెపాళా కింద పడటంతో సౌండ్ వస్తుంది. దీంతో ఆ తల్లి యాదమ్మా ఏంటా చప్పుడు? పాప చదువుకుంటుంది కదా? దానికి యాదమ్మ చేయి జారిందమ్మా అంటుంది. అటుపై తన కుమార్తె ఇంటి ఓనర్ వైపు దీనంగా చూస్తుంది.
అప్పుడా తల్లి యాదమ్మ కుమార్తెని చూసి బాధ పడతుంది. ఇంతలో మరోసారి చేయి జారి శబ్దం వస్తుంది. నీళ్లు ఆ పాప మీద పడతాయి. మళ్లీ ఓనరమ్మ యాదమ్మని దండిస్తుంది. ఆపాప చదువుకుంటుంటే? నా పాప మాత్రం నాతో పాటు అంట్లు తొముతుంది. నాలా తన బ్రతుకు కాకూడదని మనసులో అనుకుంటుంది. కానీ ఏం చేసేదని బాధపడుతుంది. అంతా నా తల రాత అనుకుంటుంది? ఇంతలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షమవుతారు.
అలా తల రాతను తిట్టుకుంటే కుదరదు. నువ్వు కూడా మీ అమ్మాయికి మంచి భవిష్యత్ ని ఇవ్వొచ్చు. దానికి మార్గం ఆమెని చదివిండచం ఒక్కటే. బడికి పంపించు అమ్మా? పనికి కాదు అంటారు. ఆ తర్వాత పని కుమార్తె స్కూల్లో కనిపిస్తుంది. 'చిన్ని చేతులు' 'శ్రమ విడిచిపెట్టాలి..పుస్తకాలు పట్టాలి'. ఇదొక 'ఐఎల్ ఓ' ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా షూట్ చేసిన వీడియో. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఇది ఇప్పటి వీడియో కాదు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం షూట్ చేసిన వీడియో. అప్పుడు చిరంజీవి సామాజిక దృక్ఫధంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. మరి అప్పుడు చేసిన వీడియో మళ్లీ ఇప్పుడు బయటకు రావడం ఏంటి? అని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈరోజుకి కూడా ఇది రిలవెంట్ గా ఉందని చిరంజీవి షేర్ చేసినట్లు తెలిపారు. సంవత్సారాలు మారినా... తరాలు మారినా.. ఇంకా బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు పనికి వెళ్తూనే ఉన్నారు.
వ్యవస్థలో మార్పు రావాలని చిరంజీవి మరోసారి సోషల్ మీడియా ద్వారా అవేర్ నెస్ తీసుకొచ్చే ఓచిన్న ప్రయత్నంలో భాగంగా షేర్ చేసిన వీడియో. 22 ఏళ్ల క్రితం సోషల్ మీడియా కూడా లేదు. కేవలం పేపర్లు..టీవీలే కాబట్టి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేసినా అవి రీచ్ అవ్వడం అన్నది వేగంగా జరిగేది కాదు. అందుకే సోషల్ మీడియా యుగంలో మరోసారి షేర్ చేస్తే బాగుంటుందని చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఆ ఛాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.