వరుణ్ తేజ్ పై మెగాస్టార్ కోపం
ఇప్పటికే నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేసిన వరుణ్ తేజ్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు.
By: Tupaki Desk | 26 Feb 2024 3:58 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తెలుగు, హిందీ భాషలలో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి1న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేసిన వరుణ్ తేజ్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ తో ఆపరేషన్ వాలంటైన్ కి హైప్ తీసుకొచ్చారు. ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ వరుణ్ తేజ్ ని మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఇరికించింది. చాలా సార్లు చిరు లీక్స్ ని మేము ఎంజాయ్ చేసాం. కానీ వరుణ్, లావణ్య లవ్ స్టోరీకి సంబందించిన విషయాన్ని ఎందుకు లీక్ చేయలేదు అని సుమ అడిగారు. మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రశ్నకి సరదాగా రియాక్ట్ అయ్యారు.
ఈ ఒక్క విషయాన్ని నాకు చెప్పకుండా దాచేశాడు. నన్ను చూసి ఇన్స్ పెయిర్ అవుతా అని అంటాడు. లీక్స్ విషయంలో కూడా ఇన్స్ పెయిర్ అయ్యి నాకు ముందు చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు. అందుకే ఇప్పటికి కోపంగా ఉంది అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. దీనిపై వరుణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. గౌరవంతో కూడిన భయం వలన చెప్పడం లేట్ అయ్యింది.
అయితే మా ఫ్యామిలీలో ఈ విషయాన్ని ముందు చెప్పింది పెదనాన్నకి అని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. వరుణ్ తేజ్, లావణ్య లవ్ స్టోరీ గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఫ్యామిలీకి కూడా తెలియకుండా వరుణ్ తేజ్, లావణ్య ఏకంగా ఏడేళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారని అర్ధమవుతోంది.
మెగాస్టార్ తన కుటుంబంతో ఎంత జోవియల్ గా ఉంటాడు అనేది ఈ సంభాషణ బట్టి అర్ధమవుతోంది. అందుకే మెగాస్టార్ కి ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేని స్థాయిలో ఇమేజ్ ఉంది. మెగా ఫ్యామిలీ వారసులు కూడా మెగాస్టార్ బాటలోనే, అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నారని చెప్పొచ్చు. ఆపరేషన్ వాలంటైన్ ప్రమోషన్స్ లో కూడా మా ఫ్యామిలీలో పెద్దోళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము ఫాలో అవుతామంటూ వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.