Begin typing your search above and press return to search.

యాంక‌ర్ సుమ సుపుత్రునికి మెగాస్టార్ ఆశీస్సులు

టీజర్‌లో తన నటనా నైపుణ్యంతో ఇప్పటికే అంద‌రి దృష్టిని ఆకర్షించిన రోషన్ కనకాల టీజర్ లాంచ్ లో తన ప్రసంగంలో పరిణతితో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 5:08 AM GMT
యాంక‌ర్ సుమ సుపుత్రునికి మెగాస్టార్ ఆశీస్సులు
X

పాపుల‌ర్ యాంక‌ర్ గా సుమ క‌న‌కాల‌... పాపుల‌ర్ స‌హాయ‌న‌టుడిగా రాజీవ్ క‌న‌కాల టాలీవుడ్‌లో ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠులు. ద‌శాబ్ధాల పాటు తెలుగు సినీరంగానికి, టీవీ ప‌రిశ్ర‌మ‌కు ఈ జంట ఎన్నో సేవ‌లు అందించారు. ఇప్పుడు వారి కుమారుడు రోష‌న్ ని హీరోగా తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. రోష‌న్ క‌న‌కాల న‌టించిన తొలి చిత్రం `బ‌బుల్ గ‌మ్` రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. రవికాంత్ పారేపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మానసా చౌదరి క‌థానాయిక. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. టీజర్‌లో తన నటనా నైపుణ్యంతో ఇప్పటికే అంద‌రి దృష్టిని ఆకర్షించిన రోషన్ కనకాల టీజర్ లాంచ్ లో తన ప్రసంగంలో పరిణతితో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ సింగిల్- ఇజ్జత్ విడుద‌లైంది. ఇందులో రోష‌న్ ఎన‌ర్టిటిక్ పెర్ఫామెన్స్ ర్యాప్ సాంగ్ కి త‌గ్గ‌ట్టు త‌న బాడీ లాంగ్వేజ్ ని ప్ర‌ద‌ర్శించిన తీరు ఆక‌ట్టుకుంది. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అత‌డు ఆశ్చర్యపరిచాడు. ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ-``సుమ‌-రాజీవ్ క‌న‌కాల సుపుత్రుడు రోష‌న్ ఆరంగేట్ర చిత్రం బ‌బుల్ గ‌మ్. ఈ చిత్రం నుంచి రెండో పాట‌ను రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఇజ్జ‌త్ మొద‌టి పాట ఎంత బాగా పాపుల‌రైందో అంద‌రికీ తెలిసిందే. ఈ పాట యూత్ ని రాక్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డింది. అంత హుషారుగా ఉంది. బ‌బుల్ గ‌మ్ ట్రైల‌ర్ చూసాను. చాలా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో యూత్ ని ఆక‌ట్టుకోవ‌డానికి కొత్త ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా ప్ర‌జెంట్ చేసాడు ద‌ర్శ‌కుడు ర‌వి పారేపు. త‌న‌ని అభినందిస్తున్నాను. శ్రీ‌కాంత్ పాకాల ర్యాప్ పాట‌ను చాలా అందంగా చేసారు. నాకైతే రోష‌న్ తో పాటు ఎగిరి గంతేయాల‌నిపించేంతగా డ్యాన్సులు చేయాల‌నిపించేంత‌గా ఆక‌ట్టుకుంది. ప్ర‌తి ప‌బ్బు క్ల‌బ్బు యూత్ ని అల‌రించే పాట ఇది. ట్రైల‌ర్ లో మాన‌స చాలా బాగా చేసింది. మాన‌స మ‌న తెలుగ‌మ్మాయి అవ్వ‌డం అభినందించ‌ద‌గినది. ముఖ్యంగా మా సుమ రాజీవ్ ఇద్ద‌రికీ ఆనంద క్ష‌ణాలు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ టు బ‌బుల్ గ‌మ్ టీమ్`` అని అన్నారు.

ఇజ్జ‌త్ అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన‌ శక్తివంతమైన గీతం. ఏది ఏమైనా తమను తాము ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలని సందేశం ఇస్తుంది. శ్రీచరణ్ పాకాల దీనికి ర్యాప్ మ్యూజిక్ ని అందించారు. దీనికి ఎంసీ గాత్రం కూడా ప్ర‌ధాన అస్సెట్. ఇక ఈ పాట ఆద్యంతం రోష‌న్ క‌న‌కాల‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన‌ర్జిటిక్ గా కనిపించాడు. ఛార్మినార్ స‌హా కొన్ని రియల్ లొకేషన్లలో చిత్రీకరించడ‌మే గాక సెట్లో ను దీనిని రూపొందించారు. ఇది మ్యూజిక‌ల్ గా చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. రాజీవ్ క‌న‌కాల‌- సుమ క‌న‌కాల కుమారుడు రోష‌న్ క‌న‌కాల‌కు మెగా బ్లెస్సింగ్స్ పుష్క‌లంగా ఉండడం ప్ర‌ధాన అస్సెట్ కానుంది. అయితే యువ‌హీరో త‌న‌దైన ప్ర‌తిభ‌తో త‌న‌ను తాను నిరూపించుకుని ప‌రిశ్ర‌మ‌లో రాణించాల్సి ఉంటుంది.