Begin typing your search above and press return to search.

ప్రేక్ష‌కులు కోరితేనే న‌న్ను హీరోని చేశారు!-చిరంజీవి

ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమా వ‌ర‌కూ కూడా అలా చిన్నా చిత‌కా పాత్ర‌లు చేసాన‌ని చిరు గుర్తు చేసుకున్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2023 4:34 AM GMT
ప్రేక్ష‌కులు కోరితేనే న‌న్ను హీరోని చేశారు!-చిరంజీవి
X

ఇండ‌స్ట్రీ అక్ష‌య పాత్ర లాంటిది ఎంద‌రు వ‌చ్చినా ఆహ్వానిస్తుంది. త‌ల్లిదండ్రులు ఆడా మ‌గా అనే తేడా లేకుండా త‌మ బిడ్డ‌ల‌ను ప్రోత్స‌హించాలి. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి అంద‌రూ అవ‌కాశాలు అందుకోవాలి.. ఇక్క‌డ అంద‌రికీ ఉపాధి దొరుకుతుంద‌ని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నేను సినీప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త‌లో చిన్నా చిత‌కా పాత్ర‌ల్లో అవ‌కాశాలిచ్చారు. సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమాలోను చిన్న పాత్ర‌లో అవ‌కాశాలిచ్చారు. అయితే వేటినీ కాద‌నకూడ‌దు. కాదు అన‌కుండా నేను చేసుకుంటూ వెళ్లాను.

కొన్నిసార్లు మ‌న‌సు నొచ్చుకున్నా చిన్న పాత్ర‌ల్లో చేశాను. కానీ అలా చేసిన ప్ర‌తిసారీ నాలో గ‌ట్స్ పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉండేది. ఏదో ఒక‌రోజు మంచి అవ‌కాశం వ‌స్తుంద‌ని వేచి చూసాను. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమా వ‌ర‌కూ కూడా అలా చిన్నా చిత‌కా పాత్ర‌లు చేసాన‌ని చిరు గుర్తు చేసుకున్నారు.

ఒక‌వేళ త‌న‌ను అడిగితే.. ముందు ప్రేక్ష‌కులు త‌ర్వాత ఇండ‌స్ట్రీ.. అని చెబుతాను. ఆ రోజుల్లో చిన్న పాత్ర‌లు చేస్తుంటే చిరంజీవి మంచి డ్యాన్సులు చేస్తున్నారు డైలాగులు చెబుతున్నారు అంటూ డిస్ట్రిబ్యూట‌ర్లు స్వ‌యంగా అడిగి మ‌రీ న‌న్ను హీరోని చేసారు. ప్రేక్ష‌కులు న‌న్ను చూడాల‌ని అనుకుంటున్నార‌ని పంపిణీదారులు న‌న్ను హీరోని చేసారు. ప్రేక్ష‌కులు కోరితే న‌న్ను హీరోని చేశారు!.. అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి లాంటి సాదాసీదా లుక్స్ తో వ‌చ్చిన వాడు లోక్లాస్ దుర్భేధ్య‌మైన క‌ష్టాల నుంచి వ‌చ్చిన వాడు ఈ ఇండ‌స్ట్రీలో రాణిస్తాడా? అని అన్నారు. కానీ నాలో గ‌ట్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. నేను అనుకున్న‌ది ఇక్క‌డ సాధించుకున్నాను.. అని చిరు ఎమోష‌న‌ల్ స్పీచ్ ఇచ్చారు. భోళాశంక‌ర్ ఈనెల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌- సుంక‌ర రామ‌బ్ర‌హ్మం సంయుక్తంగా నిర్మించారు.