విశ్రాంతిలో చిరు..మెగాస్టార్ స్పీడ్ తగ్గొచ్చా?
మెగాస్టార్ చిరంజీవి కాలికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. 'భోళాశంకర్' తర్వాత కాలికి సర్జరీ చేయించుకున్నారు
By: Tupaki Desk | 22 Sep 2023 5:33 AM GMTమెగాస్టార్ చిరంజీవి కాలికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. 'భోళాశంకర్' తర్వాత కాలికి సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పూర్తిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. లేకపోతే చిరంజీవి సినిమాలు చేయకపోయినా ఆయన ఇంటి వాతావరణమంతా నిత్యం సినిమా వాళ్లతోనే కనిపిస్తుంది. చిన్న సినిమా ఈవెంట్లు చేసుకోవాలంటే నేరుగా వాళ్లని తన ఇంటికే పిలిపించి ఆ కార్యక్రమాలు దగ్గరుండి పూర్తి చేసి పంపిస్తారు.
తప్పదు అనుకుంటే ఆయన నేరుగా ఈవెంట్ కి హాజరవుతుంటారు. అయితే కొంత కాలంగా ఇలాంటి జరగడంలేదు. చిరంజీవి సినిమాలతో బిజీగా ఉండటం..తాజాగా విశ్రాంతి తీసుకోవడంతో వ్యవహరమంతా కామ్ గా ఉంది. 156..157వ సినిమాలు ప్రకటించినప్పికీ అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయి? అన్నది ఇంకా అధికారికంగా క్లారిటీ లేదు. ముందుగా 157వ చిత్రాన్ని నవంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్తారని ప్రచారం సాగుతోంది.
ఇది సోషియా ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఇక 157వ సినిమా సంగతేంటో తెలాలి. అయితే చిరంజీవి కాలి గాయం నుంచి పూర్తిగా ఇంకా ఎంత కాలంలో కోలుకుంటారు? అన్నది కూడా తెలియదు. నెలరోజులు అని బయట ప్రచారం తప్ప అందులో వాస్తవం లేదు. చిరంజీవి కూడా ఇంత సమయం పడుతుంది? అన్న విషయాన్ని ఎక్కడా లీక్ చేయలేదు. ఆ సంగతి పక్కనబెడితే గాయం నుంచి కోలుకున్న తర్వాత మెగాస్టార్ మళ్లీ డాన్సుల పరంగా మునుపటి గ్రేస్ ని చూపిస్తారా? అన్నది సందేహమే.
ఎందుకంటే డాన్సులంటే మెగాస్టార్ పెట్టింది పేరు. 60 ఏళ్లు పైబడిన తనదైన శైలి సిగ్నేచర్ స్టెప్పులతో ఆకట్టుకోవడం ఆయనకే చెల్లింది. కానీ కోలుకున్న తర్వాత మళ్లీ అంతటి ఎనర్జీతో ఇప్పటికిప్పుడు పెర్పార్మెన్స్ చేయగలరా? అన్నది చూడాలి. 157వ సినిమా వరకూ పెద్దగా డాన్సులతో పనేం ఉండదు. సోషియో ఫాంటసీ కాబట్టి! డాన్సులకు స్కోప్ ఉండదు. 156వ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నారు. ఇక్కడ మాత్రం మెగాస్టార్ శైలి డాన్సులు తప్పనిసరి. ఇక్కడ చిరు తప్పించుకోవడానికి ఛాన్సు లేదు. మరి ఈ నేపథ్యంలోనే చిరంజీవి 156ని తాత్కాలికంగా హోల్డ్ లో పెట్టారా? అన్నది మరో సందేహం.