Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు మెగాస్టార్ డైరెక్షన్.. ఇండస్ట్రీ హిట్!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోలు అందరూ ఒక స్పూర్తిగా తీసుకుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి అనేది ఒక శకం

By:  Tupaki Desk   |   21 Aug 2024 3:52 AM GMT
ఆ సినిమాకు మెగాస్టార్ డైరెక్షన్.. ఇండస్ట్రీ హిట్!
X

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోలు అందరూ ఒక స్పూర్తిగా తీసుకుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి అనేది ఒక శకం. ప్రస్తుతం సీనియర్ హీరోగా ఉన్న కూడా అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్స్ లలో ఒకరిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ఆయన ఎంత రిస్క్ అయిన చేయడానికి రెడీ అవుతారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిలో కూడా ఓ మంచి దర్శకుడు ఉన్నాడనే మాట చాలా మంది చెబుతారు.

ఇంద్ర సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యజ్ఞం చేసే సీక్వెన్స్, వర్షం పడటం, ఫైట్ సీన్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కించారంట. గతంలో రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం రివీల్ చేశారు. ఇంద్ర సినిమాకి బి గోపాల్ దర్శకుడు అనే సంగతి అందరికి తెలిసిందే. ఆయన అడవి రాముడు సినిమా సాంగ్ షూటింగ్స్ కోసం స్విడ్జర్లాండ్ వెళ్లిపోయారంట. ఆ సమయంలో మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిరంజీవి దర్శకత్వం బాధ్యతలు చెప్పట్టారంట.

పెండింగ్ ఉండిపోయిన ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అన్నింటిని కూడా ఏకధాటిగా 28 రోజుల పాటు చిత్రీకరించారంట. మే నెలలో మండుటెండలో కంటిన్యూగా విశ్రాంతి తీసుకోకుండా ఆయన ఆ సన్నివేశాలు అన్ని తెరకెక్కించారంట. మండుటెండలో ఒంటిపై షర్టు లేకుండా యజ్ఞం ముందు కూర్చొని చేసే సీన్స్ చాలా కష్టం అయిన కూడా చిరంజీవి చాలా ఓపికగా వాటిని డిజైన్ చేసారంట. షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక జూనియర్ ఆర్టిస్ట్స్ అందరికి మెగాస్టార్ చేతులు జోడించి థాంక్స్ చెప్పారంట.

రిలీజ్ ఆలస్యం కాకూడదని ఇలా ఈ ఎండలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందని క్షమించాలని కోరారంట. మీరు షూటింగ్ చేస్తేనే మా కడుపు నిండుతుంది… మాకు దీంట్లో ఎలాంటి బాధలేదని ఆర్టిస్ట్స్ కూడా మెగాస్టార్ చిరంజీవికి చెప్పారంట. చిరంజీవి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని రాజా రవీంద్ర ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాటల బట్టి ఇంద్ర సినిమాలోని వర్షం, యజ్ఞం ఎపిసోడ్ మొత్తానికి చిరంజీవి దర్శకత్వం వహించారనే విషయం రివీల్ అయ్యింది.

ఇంద్ర సినిమాలో ఈ సన్నివేశం ఎంతలా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఇలా చిరంజీవి కొన్ని సందర్భాలలో కీలక సన్నివేశాలకి దర్శకత్వం వహించి తెరకెక్కించారు. అయినా కూడా ఎప్పుడు కూడా దర్శకుడిగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక యాక్టర్ గా మాత్రమే చిరంజీవి అందరికి చేరువ అయ్యారు.