Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురితో మెగాస్టార్ చిరంజీవి

అదే స‌మ‌యంలో మ‌రో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు చరణ్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 2:27 AM GMT
ఆ న‌లుగురితో మెగాస్టార్ చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీక‌ర‌ణ‌ల‌పై దృష్టి సారించారని వార్త‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో మ‌రో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు చరణ్ తాజా ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ఈ నాలుగు ప్రాజెక్ట్‌ల వివరాలను వెల్లడించడానికి చరణ్ నిరాకరించగా, ఊహాగానాలు జోరందుకున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ డ్రామా 'విశ్వంభర' చేస్తున్నాడు. గాడ్ ఫాదర్, తని ఒరువన్ చిత్రాల‌ దర్శకుడు మోహన్ రాజాతో కలిసి పనిచేయాలని కూడా భావిస్తున్నారు. సర్దార్ దర్శకుడు పి.ఎస్ మిత్ర‌న్‌తో చ‌ర్చిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. నాలుగో ప్రాజెక్ట్ ఎవ‌రితో అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

ఇటీవ‌ల చిరు రీమేక్‌ల నుండి దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకున్నారు. దానికి బ‌దులుగా చురుగ్గా ఒరిజిన‌ల్ స్క్రిప్ట్‌లను వింటున్నాడు.. కొత్త జానర్‌లను అన్వేషిస్తున్నాడు. చిరు త‌దుప‌రి మెగా ప్రాజెక్ట్‌లపై మరింత స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరు పుట్టినరోజు ఆగస్టు 22న వెల్లడి కావచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో 'విశ్వంభర' 2025 సంక్రాంతికి విడుదల కానుంది. నేటిత‌రం స్టార్ల‌తో పోటీప‌డుతూ చిరు వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తున్నారు.