Begin typing your search above and press return to search.

మెగాస్టార్.. ఆలస్యం అమృతం!

దీంతో మెగాస్టార్ మళ్ళీ ఎప్పటిలానే తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో కూడా డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకున్నాడు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 2:45 AM GMT
మెగాస్టార్.. ఆలస్యం అమృతం!
X

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కోసం గతంలో చాలా ఎక్కువ సమయం తీసుకున్నా డు. అయితే ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ అయితే కాలేదు. దీంతో మెగాస్టార్ మళ్ళీ ఎప్పటిలానే తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో కూడా డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి కొన్ని ఊహించని డిజాస్టర్స్ అయితే వచ్చాయి. ఆచార్య సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ అంతగా సక్సెస్ అయితే కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. చాలా కాలం తర్వాత మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ను చూసాము అనేంతల ఆడియన్స్ ఆ సినిమాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.

దీంతో మెగాస్టార్ చిరంజీవి ఫామ్ లోకి వచ్చినట్లే అని అందరూ అనుకున్నారు. అయితే ఆయన చేసిన మరొక పెద్ద మిస్టేక్ భోళా శంకర్ అని మళ్ళీ రీమేక్ కథతో రావడంతో ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించలేదు. మెగాస్టార్ ను ఒరిజినల్ కథలలో చూడాలని అనుకుంటున్నారని ఆ సినిమాతో అర్ధమయ్యింది.

ఇక ఈ మధ్యకాలంలో చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన మెగాస్టార్ సక్సెస్ కంటే కూడా డిజాస్టర్స్ ఎక్కువగా చూశారు. దీంతో ఇప్పుడు మళ్లీ కాస్త నెమ్మదిగా సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. లేట్ అయినా కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసింది.

ఈ సినిమాలో ఒక మిడిల్ ఏజ్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు. సినిమాలో నలుగురు హీరోయిన్స్ కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక విశ్వంభర అనే ఆ సినిమా వచ్చే ఏడాది వస్తుందేమో అని ఓవర్గం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఆ అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో మొదలుకానుంది. ఇక ఫాంటసీ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ కోసం ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు. దీంతో 2024 లో ఈ సినిమా రావడం డౌటే. ఇక అన్ని కుదిరితే మాత్రం 20025 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.