2024 లోనూ మెగాస్టార్ దూకుడే దూకుడు!
టాలీవుడ్ లో మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్నాయంటే ఓటీటీ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అక్కడ రెస్పాన్స్ చూసే వాటిని రీమేక్ రూపంలో ఇతర భాషల్లోకి తీసుకొస్తున్నారు.
By: Tupaki Desk | 22 Jan 2024 12:30 AM GMTమార్కెట్ లో మలయాళ కంటెంట్ ఏ రేంజ్ లో ఫేమస్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక మలయాళ సినిమాలు అన్ని భాషలకు మరింత చేరువవుతున్నాయి. ఒకప్పటి మలయాళ సినిమా అంటే కేవలం స్థానిక థియేటర్లకే పరిమితయ్యేది. కానీ నేటి ఓటీటీ ట్రెండ్ అందుబా టులోకి రావడంతో మలయాళ సినిమా క్రేజ్ రెట్టింపు అవుతుంది. అన్ని భాషల్లోనూ ఆ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది.
టాలీవుడ్ లో మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్నాయంటే ఓటీటీ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అక్కడ రెస్పాన్స్ చూసే వాటిని రీమేక్ రూపంలో ఇతర భాషల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడీ ట్రెండ్ మరింత పెరిగింది. ఫలితంగా అక్కడ చిన్న చిన్న నటులు సైతం వెలుగులోకి వస్తున్నారు. ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇక యధావిధిగా మరోసారి మాలీవుడ్ సినిమాలకు ప్రేక్షకులకు ఓటీటీలో దాసోహం అవుతున్నారు.
అందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి ముందు వరుసలో కనిపిస్తున్నారు. గత ఏడాది ఆయన నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు మంచి విజయాలు సాధించినవే. స్టార్ అనే ఇమేజ్ లేకుండా తెరకెక్కిన ఆ సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి. `నన్పగల్ రదు మయ గం`..`క్రిస్టోపర్`..` కన్నూర్ స్వ్యాడ్`..`కాదల్ ది కోర్` గత ఏడాది రిలీజ్ అయినవే. 70 ఏళ్ల వయసు లోనూ మమ్ముట్టి నటించిన తీరు మరోసారి అందర్నీ మెప్పించింది.
నాలుగు డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరించారు. నాలుగు కథలు ఒకదానికొకటి ఏ మాత్రం సంబం ధం లేకుండా వైవిథ్యతో ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాలవి. కంటెట్ తో పాటు నటీనటులు ఎంతో బ్యాలెన్స్ గా చేసిన చిత్రాలవి. స్టార్ అనే ఇమేజ్ ని మమ్ముట్టి పక్కనబెట్టిన చేసిన చిత్రాలవి. రెండు సినిమాల్లో కమర్శియల్ అంశాలు జోప్పించినా మరీ అతిలేదు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు తెలుగు హీరోలు ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయరు? అనే ఓ ప్రశ్న మదిలో తప్పక మెదులుతుంది. మరి మన హీరోలు ఇప్పటికైనా ఆ తరహా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. 2024 లోనూ మమ్ముట్టి ఐదారు సినిమాలతో మెప్పించడానికి రెడీ అవుతున్నారు.