Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డ్ గ్ర‌హీత బ‌న్నీకి మెగాస్టార్ పార్టీ?

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. ఈసారి పార్టీ మెగాస్టార్ చిరంజీవి త‌మ కాంపౌండ్ లో ఎరేంజ్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 8:10 AM GMT
జాతీయ అవార్డ్ గ్ర‌హీత బ‌న్నీకి మెగాస్టార్ పార్టీ?
X

ప్ర‌తిసారీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రు విజ‌యం సాధించినా అల్లు అర్జున్ - అర‌వింద్ ప్ర‌త్యేకించి సన్మానాలు స‌త్కారాలు చేస్తారు. ముఖ్యంగా సాటి హీరోల‌ను అభినందిస్తూ బ‌న్నీకి పార్టీలు చేయ‌డం అల‌వాటు. విజ‌య్ దేవ‌ర‌కొండ, కార్తికేయ‌ స‌హా ప‌లువురు హీరోల కోసం బ‌న్ని పార్టీలు చేసాడు. అందుకే ఇప్పుడు బ‌న్ని విక్ట‌రీని సెల‌బ్రేట్ చేసేందుకు పార్టీ చేసేది ఎవ‌రు? అంటూ చ‌ర్చ సాగుతోంది.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. ఈసారి పార్టీ మెగాస్టార్ చిరంజీవి త‌మ కాంపౌండ్ లో ఎరేంజ్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. బ‌న్ని జాతీయ‌ ఉత్త‌మ న‌టుడు అవార్డ్ అందుకున్నాడ‌ని తెలియ‌గానే మెగాస్టార్ చిరంజీవి.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే శుభాకాంక్ష‌లు తెలిపారు. బ‌న్ని ప్ర‌తిభ‌ను కొనియాడారు. అయితే ఇది ఇక్క‌డికే ప‌రిమితం కాదు.

మెగా ఇంట ఇప్పుడు సెల‌బ్రేష‌న్ టైమ్. బ‌న్ని విక్ట‌రీని త‌మ విక్ట‌రీగా మెగా కాంపౌండ్ సెల‌బ్రేష‌న్ కి ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం. ఈ పార్టీలో మెగా హీరోలంతా ఓ వేదిక‌పైకి వ‌స్తార‌ని తెలుస్తోంది. వందేళ్లు పైబ‌డిన భారతీయ సినిమా చ‌రిత్ర‌లో 90ఏళ్లు పైబ‌డిన టాలీవుడ్ హిస్ట‌రీలో తొలి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా బ‌న్ని రికార్డుల‌కెక్కాడు. అందుకే ఈ పార్టీ ఘ‌నంగా ఉండాల‌ని మెగా- అల్లు కాంపౌండ్లు త‌ల‌పోస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్పుడు బ‌న్ని నిజంగానే మెగాస్టార్ చేతుల‌మీదుగా స‌త్కారం అందుకునేందుకు పూర్తి అర్హుడు.

మావ‌య్య అండ‌దండ‌లు ఆశీస్సుల‌తో బ‌న్ని న‌టుడిగా ప్రారంభ‌మై ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. త‌న‌దైన యూనిక్ స్టైల్ తో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. పుష్ప‌రాజ్ గా అత‌డి న‌ట‌న‌కు ప్ర‌జ‌లంతా జేజేలు ప‌లికారు. ఇప్పుడు జాతీయ స్థాయి జూరీ కూడా బ‌న్ని న‌ట‌న‌కు జేజేలు ప‌ల‌క‌డ‌మే గాక ఉత్త‌మ‌న‌టుడు అవార్డును నిరంకుశ‌త్వానికి అతీతంగా క‌ట్ట‌బెట్టింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ కి మెగా స‌న్మానంపై గుస‌గుస‌లు మాత్ర‌మే వినిపిస్తున్నాయి. అధికారికంగా దీనిని మెగా కాంపౌండ్ ప్ర‌క‌టించాల్సి ఉంది.