మెగాస్టార్-సూపర్ స్టార్ కంట కన్నీరు!
మరి ఇలాంటి అనుభూతిని మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార మహేష్ లు ఎప్పుడైనా పొందారా?
By: Tupaki Desk | 31 July 2023 11:30 PM GMTసినిమా అయినా కొన్ని పాత్రలు ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తాయి. అందులో లీనమై బావోద్వేగాలకు కనెక్ట్ అయితే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనది. అందులోనూ వాస్తవాల కు దగ్గరగా ఉన్నా..ఎమోషన్ గా కనెక్ట్ అయ్యే పాత్రలు మరింతగా ప్రేక్షకుల్న హృదయాల్ని టచ్ చేస్తుంటాయి. అందుకే సినిమా చూసిన సెలబ్రిటీ అయినా ఓ సాధారణ ప్రేక్షకుడిలా మారిపోతారు. థియేటర్లో ఉన్నంత సేపు ఆ కథకి..పాత్రలకు కనెక్ట్ అయితే సాధారణ ప్రేక్షకుడైనా..సెలబ్రిటీ అయినా ఒక్కటే? అందులో నటించి నటీనటులైనా ఒక్కటే అని ఎన్నోసార్లు రుజువైంది.
మరి ఇలాంటి అనుభూతిని మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార మహేష్ లు ఎప్పుడైనా పొందారా? అంటే అవుననే తెలుస్తోంది. 'శంకరాభరణం' సినిమాలో ఓ పాత్ర చిరంజీవి కంట కన్నీరు తెప్పించింది. అదేంటో ఆయన మాటల్లోనే.. ' ఒక రోజు మంజు భార్గవి ఫోన్ చేసి 'శంకరాభరణం' ప్రివ్యూ చూడటానికి పిలిచారు. అదెంతో గౌరవంగా భావించి వెళ్లా. తీరా సినిమా పూర్తై లైట్లు వెలిగే సమయానికి కళ్లు తుడుచుకుంటూ ఉన్నా. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
వాస్తవానికి నా కంట కన్నీరు వస్తున్నట్లు నాకు తెలియలేదు. అందులో మంజు భార్గవి గారి పాత్ర అంతగా మనసుకు హత్తుకుంది. అది సినిమా అని మర్చిపోయి నిజ జీవితంలా పీలవ్వడంతో ఏడుపు వచ్చేసింది. కంట్రోల్ చేసుకుందామన్నా కన్నీళ్లు ఆగడం లేదు. ఆ తర్వాత కాసేపటికి నా గురించి ఎవరేమనుకున్నారో? అని అక్కడ నుంచి లేచి వచ్చేసాను' అని అన్నారు.
ఇలాంటి అనుభవం మహేష్ కి ఓ సినిమా విషయంలో ఎదురైందిట. 'ది లయన్ కింగ్' చిన్న పిల్లలు చూసే సినిమా అనుకుంటారు చాలా మంది. కానీ అందులో కుటుంబ బంధాల్ని ఎంతో చక్కగా చూపించా రు. ఆ సినిమా చూసినప్పుడు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి. ఇంటి పెద్ద చనిపోయి నప్పుడు ఆ కుటుంబ పరిస్థితి..ఆడవాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పిల్లలు పడే ఇబ్బందులు అందులో కనిపిస్తాయి. తండ్రిగా నేను ఆ సినిమాకి కనెక్ట్ అవ్వడం వలనే నాకు అంత బాధగా అనిపించింది' అని అన్నారు.