Begin typing your search above and press return to search.

మెఘా ఆకాష్.. అసలైన సన్‌షైన్ గర్ల్

'సన్ షైన్ గర్ల్' అంటూ క్యాప్షన్ పెట్టిన మెఘా ఆకాష్, బీచ్ వైబ్స్‌లో దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 March 2025 8:00 PM IST
మెఘా ఆకాష్.. అసలైన సన్‌షైన్ గర్ల్
X

మెఘా ఆకాష్ గ్లామర్‌కు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. క్యూట్ లుక్స్, మధురమైన నవ్వుతో అభిమానుల హృదయాలను దోచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కొత్త ఫొటోషూట్‌తో మరోసారి ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేసింది. 'సన్ షైన్ గర్ల్' అంటూ క్యాప్షన్ పెట్టిన మెఘా ఆకాష్, బీచ్ వైబ్స్‌లో దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ ఫోటోలలో మెఘా ఆకాష్ వైట్ అండ్ గ్రీన్ కలర్‌ మిక్స్ అయిన ఆఫ్ షోల్డర్ టాప్ ధరించి, స్టైలిష్ యాక్సెసరీస్‌తో అదిరిపోయేలా మెరిసిపోయింది. సన్‌గ్లేర్స్ లేకుండా నేచురల్ లైట్‌లో తన మెరుపును చూపిస్తూ, ఆమె పింక్ ఇయర్‌రింగ్స్ తో మరింత స్టైలిష్‌గా కనిపించింది. స్వచ్ఛమైన ముద్దు నవ్వుతో మెఘా పోజులిచ్చిన తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.


ఇటీవలే తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త దశకు వెళ్లిన మెఘా ఆకాష్, పెళ్లి అనంతరం శ్రీలంక ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ లాకేశన్స్, బీచ్ వైబ్స్‌ను తన ఫోటోషూట్‌లో మిళితం చేసి అందరికీ ఓ ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చింది. మెరిసే చర్మం, నేచురల్ లుక్‌తో మెఘా ఆకాష్ అసలైన 'సన్‌షైన్ గర్ల్' అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే, మెఘా ఆకాష్ తెలుగు ప్రేక్షకులకు ‘లై’, ‘చల్ మోహన్ రంగ’ సినిమాలతో బాగా దగ్గరైంది.

తమిళ, హిందీ, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఆమె నుంచి మరిన్ని అప్‌డేట్స్ రావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, మెఘా ఆకాష్ షేర్ చేసిన తాజా ఫోటోలు చూసిన అభిమానులు ఆమె అందానికి మరో లెవెల్‌లో మైమరచిపోతున్నారు. ఈ ఫోటోషూట్‌లో ఆమె స్టైల్, గ్లామర్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్లన్నీ కలిపి మరింత ఆకర్షణీయంగా మారాయి.