Begin typing your search above and press return to search.

మేఘా ఆకాష్ అందం.. ఏంజెల్ కంటే ఎక్కువే..

ఆ వేడుక తర్వాత అమ్మడు బ్యాచిలర్ పార్టీ కోసం శ్రీలంకకు వెళ్ళింది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 9:53 AM GMT
మేఘా ఆకాష్ అందం.. ఏంజెల్ కంటే ఎక్కువే..
X

మెఘా ఆకాష్ తన వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అడుగు వేయబోతోంది. చాలా.కాలంగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ ఎప్పుడు కూడా ప్రేమ విషయాన్ని బయటకు లీక్ చేయలేదు. ఇక ఆమె ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం జరుపుకుంది. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ వేడుక తర్వాత అమ్మడు బ్యాచిలర్ పార్టీ కోసం శ్రీలంకకు వెళ్ళింది.


మెఘా ట్రిప్‌కు సంబంధించిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. శ్రీలంకలోని ఆ అందమైన దీవిలో మెఘా చేస్తున్న సరదా ప్రయాణం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆమె శ్రీలంకలోని అందమైన లొకేషన్స్ లో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


తాజాగా మెఘా ఆకాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో, ఆమె ఒంటి మీద తెల్లని షోల్డర్ డ్రాప్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఆ లుక్‌తో పాటు చేతిలో కోల్డ్ డ్రింక్, హెయిర్ స్టైల్‌కి చక్కగా సరిపోయే పూలతో మెఘా బ్రైడ్ మూడ్ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. మెరిసే చర్మం, గ్లామరస్ మేకప్ ఆమెకు మరింత అందాన్ని జోడించింది. ఈ ఫొటోలో మెఘా ఒక దేవతలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


మెఘా తన స్నేహితులతో కలిసి శ్రీలంకలో ఓ బ్యాచిలర్ పార్టీ కూడా ఎంజాయ్ చేసింది. ఆ ట్రిప్ లో కూడా చాలా సరదాగా గడిపిందని ఫొటోలు, వీడియోలు ద్వారా తెలియజేస్తోంది. ఇక మెఘా ఆకాష్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు "లై" మరియు "చల్ మోహన్ రంగ" వంటి చిత్రాల ద్వారా బాగా పరిచయం అయ్యింది.

ఆమె తన నటనతోనే కాకుండా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగుతున్న ఈ మార్పులు ఆమె అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్లి తరువాత అమ్మడు మళ్ళీ సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. ఆ మధ్య ఒక వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్నట్లు చెప్పింది. అలాగే రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. మరి ఆ ప్రాజెక్టులపై అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.