ప్రియుడితో ఘనంగా మేఘా ఆకాష్ వివాహం
నటి మేఘా ఆకాష్ ఓ ఇంటిదైంది. ప్రియుడు సాయి విష్ణుతో ఆమె వివాహం ఘనంగా జరిగింది.
By: Tupaki Desk | 15 Sep 2024 3:32 PM GMTనటి మేఘా ఆకాష్ ఓ ఇంటిదైంది. ప్రియుడు సాయి విష్ణుతో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాలులో ఈ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. శనివారం సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై దంపతులకు అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు దుస్తుల్లో మేఘా ఆకాష్ ఎంతో అందంగా ఉంది. పెళ్లి పీఠలపై భర్త విష్ణు భార్య బుగ్గను ముద్దాడుతున్నాడు. ఆ సమయంలో మేఘా ఆకాష్ ఎంతో అందంగా నవ్వుతూ సిగ్గులొలికించింది. అలాగే నిశ్చితార్దం సందర్భంగా వధువరూలిద్దరు దిగిన ఓటోల్లోనూ జంట ఎంతో అందంగా కనిపిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో ఇద్దరు ఎంతో ఆకర్షణీయంగా ముస్తాబయ్యారు.
మేఘా ఆకాష్ `లై `సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. అందులో నితిన్ కి జోడీగా నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా ఆ వెంటనే నితిన్ తోనే `ఛల్ మోహనరంగ` అనే మరో సినిమా చేసింది. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వత తమిళ్, హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరికొన్ని తెలుగు సినిమాలు చేసింది.
కానీ ఇవేవి మేఘా ఆకాష్ నిలదొక్కుకోవడానికి పని కొచ్చిన సినిమాలు కావు. దీంతో తమిళ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగు లోనూ ఓ రెండు సినిమాలు చేస్తోంది. పెళ్లికి ముందు కమిట్ అయిన సినిమాలివి. మరి వివాహమైన నేపథ్యంలో సినిమాలు కంటున్యూ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.