Begin typing your search above and press return to search.

రజనీకాంత్ తో మేఘా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

తమిళంలో ఎన్నై నోకి పాయుమ్ తోటా, పేట, యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్ పంటి చిత్రాలలో నటించడం ద్వారా కోలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటి మేఘా ఆకాష్.

By:  Tupaki Desk   |   25 Aug 2024 11:56 AM GMT
రజనీకాంత్ తో మేఘా.. వైరల్ అవుతున్న ఫోటోలు..
X

తమిళంలో ఎన్నై నోకి పాయుమ్ తోటా, పేట, యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్ పంటి చిత్రాలలో నటించడం ద్వారా కోలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటి మేఘా ఆకాష్. తమిళంతో పాటు మేఘాకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కుర్ర కారు మది దోచుకున్న ఈ బ్యూటీ సాయి విష్ణు అనే వ్యక్తితో గత ఆరు సంవత్సరాలుగా సీక్రెట్ లవ్ లో ఉంది. ఇప్పటికీ ఆమె సీక్రెట్ వ్యవహారం బయటపడింది.

ఇంతకీ మేఘా ఆకాష్ ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా?తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తిరునవుక్కరసు కుమారుడే ఈ సాయి విష్ణు. అతనితో మేఘాకు 9 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఇప్పుడు వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెప్పారు. దీంతో వీరు త్వరలో వివాహ బంధంతో ఒకటవడానికి సిద్ధంగా ఉన్నారు.ఇటీవల వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిమానులకు కూడా పంచుకుంది.

మేఘా ఆకాష్ - సాయి విష్ణుల వివాహం వచ్చేసెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరగనుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కుటుంబ సభ్యులు ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ఆహ్వానించడానికి మేఘా ఆకాష్ తనకు కాబోయే భర్తతో కలిసి తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్ళింది. రజనీకాంత్ నివాసంలో ఆయనను కలిసిన ఈ జంట తమ వివాహ ఆహ్వానం అందజేశారు

ఈ నేపథ్యంలో కాబోయే కొత్తజంటను ఆశీర్వదించిన రజనీకాంత్ వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మేఘా రజనీకాంత్ పేట మూవీలో నటించడం తనకు మరిచిపోలేని అనుభూతి అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఎప్పటికీ తాను రజినీకాంత్ అభిమానిని అని కూడా పేర్కొన్నారు. మేఘ ఆకాష్ తెలుగులో లై, చల్ మోహన్ రంగ , డియర్ మేఘా చిత్రాలలో నటించింది.

గత కొద్దికాలం గా సరియైన సక్సెస్ లేక మేఘా ఆకాష్ మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన రావణాసుర మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళ్లో ఒక సినిమా, తెలుగులో రెండు సినిమాలలో మేఘా ఓకే చెప్పింది.