Begin typing your search above and press return to search.

RC16 కోసం మరో టాలెంటెడ్ నటి!

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   17 March 2025 3:12 PM IST
RC16 కోసం మరో టాలెంటెడ్ నటి!
X

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న RC16 సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. చరణ్ గతంలో ‘రంగస్థలం’ సినిమాతో మాస్, నేటివిటీ అంశాలను మిక్స్ చేస్తూ భారీ విజయం సాధించగా, ఇప్పుడు మరోసారి నేటివిటీ నేపథ్యంలో మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా RC16 వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆసక్తికరమైన అప్‌డేట్స్ వస్తుండగా, తక్కువ గ్యాప్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఈ సినిమాలో స్టార్ కాస్ట్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి భారీ క్యాస్ట్ ఇందులో భాగమయ్యారు. ప్రధాన పాత్రలతో పాటు, కీలకమైన క్యారెక్టర్లకు కూడా తగిన నటీనటులను ఎంపిక చేయడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో పాటు, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. కన్నడ నటి మెఘనా రాజ్ సర్జా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుందని సమాచారం. ఇది మెఘన రాజ్ టాలీవుడ్‌లో కీలక ప్రాజెక్ట్‌గా మారనుంది. ఆమె కెరీర్‌లో ఇదొక బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మెఘనా ఇప్పటి వరకు కన్నడ చిత్రాల్లో ఎక్కువగా కనిపించినా, ఆమె పెర్ఫార్మన్స్‌ను గుర్తించిన బుచ్చిబాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కంటే భిన్నంగా రూపొందనుంది. చరణ్ ఇందులో ‘ఆట కూలీ’ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. కథలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి అనేక రకాల ఆటలతో, ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాతో కథను నడిపించనున్నారు. బుచ్చిబాబు గతంలో ‘ఉప్పెన’లో ఓ ఇంటెన్స్ స్టోరీ అందించినట్లుగానే, ఇందులో కూడా ప్రేక్షకులకు అద్భుతమైన కథను అందించనున్నాడని టాక్.

సినిమా గ్రాండ్ లెవెల్‌లో రూపొందించబడుతుండటంతో, నటీనటుల పెర్ఫార్మెన్స్‌కి మరింత ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా, 2026 సమ్మర్ టార్గెట్‌గా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి మెఘనా రాజ్ సర్జా క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.