మెహర్ రమేష్ కుటుంబంలో విషాధం!
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో విషాధం చోటు చేసుకుంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి గురువారం హైదరాబాద్ లో కన్నుమూసారు.
By: Tupaki Desk | 27 March 2025 10:04 AMటాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో విషాధం చోటు చేసుకుంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి గురువారం హైదరాబాద్ లో కన్నుమూసారు. సత్యవతి మృతిపట్ల నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్బంగా సత్యవతి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. సత్యవతి కుటుంబం విజయవాడలోని మాచర్ల ప్రాంతంలో నివేసించేది.
`చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం అని పవన్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఓ ప్రకటన విడుదల చేసారు. దీంతో మెహర్ రమేష్..మెగా కుటుంబం మధ్య బంధుత్వం మరోసారి స్పష్టమైంది. మెహర్ రమేష్ డైరెక్టర్ అయిన కొత్తలో మెగా కుటుంబానికి బంధువని అను కునేవారు. కాలక్రమంలో డైరెక్టర్ గా అతడికి గుర్తింపు వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పలు సినిమా వేడుకల్లో తమ బంధుత్వం గురించి చెప్పే ప్రయత్నం చేసేవారు.
అయితే మెహర్ దర్శకుడిగా ఎదిగింది తన సొంత ట్యాలెంట్ తోనే. అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ మొదలు పెట్టి డైరెక్టర్ గా ఎదిగాడు. తనకంటూ ఓ ఐడెంటిటీ వచ్చిన తర్వాతే మెగా కుటుంబానికి బంధువు అన్న విషయం బయటకు వచ్చింది. మెగా ఫ్యామిలీ విషయంలో రమేష్ కూడా ఏనాడు అడ్వాంటేజ్ తీసుకోలేదు.
మెగా ఫ్యామిలీ మా బంధువులేనని ఆయన ఇండస్ట్రీలో ఎక్కడా చెప్పుకోలేదు. డైరెక్టర్ గా గుర్తింపు వచ్చిన చాలా కాలం తర్వాత చిరంజీవి అతడికి `భోళా శంకర్` చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ ఆయనపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆసినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు.