Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : మెహ్రీన్‌ అందాల మాయాజాలం

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌.

By:  Tupaki Desk   |   2 Dec 2024 8:30 AM GMT
పిక్‌టాక్ : మెహ్రీన్‌ అందాల మాయాజాలం
X

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఈ అమ్మడిని కెరీర్‌ ఆరంభంలో జూనియర్‌ మల్కీ బ్యూటీ అంటూ పిలిచే వారు. మిల్కీ బ్యూటీ తమన్నా మాదిరిగా స్కిన్‌ టోన్‌ అదిరి పోయిందని, మెహ్రీన్‌ కి సైతం మంచి ఫ్యూచర్‌ ఉందని కెరీర్‌ ఆరంభంలో చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో భారీ విజయాలు సొంతం కాలేదు. చేసిన కొన్ని సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌లు ఉన్నాయి. ఎఫ్ 2 వంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకున్నా ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు దక్కించుకోవడంలో మెహ్రీన్‌ ఫెయిల్‌ అయ్యింది.

కెరీర్‌లో కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఆఫర్లు తగ్గాయి అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఆ నిర్ణయాలు ఏంటి అనే విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో ఈమె ఇంకా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉంది. తన అభిమానులతో పాటు నెటిజన్స్ ని మాయ చేస్తూ అందంతో మత్తు చల్లినట్లుగా కవ్విస్తోంది. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం మెహ్రీన్‌కే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2 సినిమాలతో సక్సెస్‌లు దక్కించున్న మెహ్రీన్‌ ఎఫ్‌ 3 తర్వాత పెద్దగా కనిపించడం లేదు.

సినిమాల్లో ఎక్కువగా కనిపించకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం మెహ్రీన్‌ రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల ఆరబోత ఫోటోల కారణంగా రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటుంది. కనుక ముందు ముందు ఈమె మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహ్రీన్‌ అందానికి మరో అయిదు ఆరు ఏళ్లు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

మెహ్రీన్‌ ఒక సాధారణ సిక్కు ఫ్యామిలీలో జన్మించింది. చిన్న వయసులోనే కెనడాలోని టొరంటోలో మిస్‌ పర్సనాలిటీ సౌత్‌ ఆసియా కెనడా 2013 కిరీటాన్ని సొంతం చేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు మోడలింగ్‌లో రాణించిన మెహ్రీన్‌ కి సినిమాల్లో ఆఫర్లు వచ్చినా మోడలింగ్‌ కంటిన్యూ చేసింది. ఆ మోడలింగ్‌ అనుభవంతో ఎన్నో కమర్షియల్‌ యాడ్స్‌ లో ఇప్పటికీ నటిస్తూనే ఉంది. ముందు ముందు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్‌గా మారాలని ఆశ పడుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరి మళ్లీ మెహ్రీన్‌కి ఆఫర్లు దక్కేనా చూడాలి.