బీచ్ బ్యూటీనే ఎరుపెక్కించిన హనీ!
అంతకు ముందు కొన్ని పరాజయాలు ఎదురైనా? విజయాలు అవకాశాలు తెచ్చి పెడతాయని ఆశించింది.
By: Tupaki Desk | 27 Aug 2024 9:30 PM GMTమెహరీన్ పిర్జాదా వెండి తెరపై కనిపించి రెండేళ్లు దాటింది. చివరిగా 'ఎఫ్ -3' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అమ్మడి జాడ కానరాలేదు. `స్పార్క్ లైఫ్` అనే మరో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆ సినిమా పై మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సక్సెస్ లున్నా? అవకాశాలు అందుకో కపోవడంలో మెహరీన్ దుర దృష్ట వంతురాలే అనాలి. `ఎఫ్3 `కంటే ముందు `మంచిరోజులొచ్చాయి` అంటూ మరో సక్సెస్ అందుకుంది.
అంతకు ముందు కొన్ని పరాజయాలు ఎదురైనా? విజయాలు అవకాశాలు తెచ్చి పెడతాయని ఆశించింది. అలా ఆశించడంలో తప్పులేదు. కానీ అమ్మడి కెరీర్ మాత్రం అలా ముందుకు సాగలేదు. తాను ఒకటను కుంటే? జరిగింది మరోలా కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఏ భాషలోనూ సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంది. అన్ని పరిశ్రమలకంటే తెలుగులోనే బాగా ఫేమస్ అయింది. కానీ ఇప్పుడు పరిస్థితే వేరు.
తాజాగా అమ్మడు ఇన్ స్టాలో ఓ కొత్త ఫోటోతో అభిమానుల్ని పలకరించింది. ఇదిగో ఇక్కడిలో బీచ్ లో రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో అందగా ముస్తాబైన పిక్ తో హాయ్ చెప్పింది. వెనున నీలి రంగు సముద్రం....నేల తెల్లని ఇసుకతో ఉండి ఉంది. ఆ బ్యూటీని కవర్ చేస్తూ అమ్మడిలా రెడ్ కలర్ బీచ్ ని ఎరుపెక్కించింది.
చేతిలో హ్యాండ్ బ్యాగ్... తల కురులు సర్దుకుంటూ కెమారాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ యూజర్ రెడ్ హాట్ చిల్లీ పెప్పర్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇంకా ఇలాంటి ఆసక్తికర కామెంట్లు ఎన్నో.