తప్పుడు వార్తలపై హీరోయిన్ ఫైర్.. జాగ్రత్త అంటూ..
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
By: Tupaki Desk | 15 May 2024 5:34 AM GMTఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. హనీ ఈజ్ ద బెస్ట్ లాంటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ కొన్ని నెలల తర్వాత తన పెళ్లి రద్దు అయినట్లు చెప్పి షాక్ ఇచ్చింది.
ఇక కొంత గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఇటీవల తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది మెహ్రీన్. గత రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నించగా.. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి అయ్యిందని తెలిపింది. అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పింది. ప్రపంచంలో చాలా మందికి అవగాహన కల్పించేందుకు తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న విషయాన్ని బయట పెట్టినట్లు చెప్పింది.
దీంతో నెట్టింట మెహ్రీన్ గర్భం దాల్చిందని, ఆమె పెళ్లి కాకుండా తల్లి అయిందని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా వాటిపై మెహ్రీన్ స్పందించింది. కొన్ని మీడియాలు రాసిన వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన అవసరం లేదని తెలిపింది. కొంతమంది మీడియా ప్రతినిధులు తమ ఉద్యోగాన్ని గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని, తప్పుడు సమాచారంతో వార్తలు ప్రచురించడం అనైతికం కాదు, చట్టవిరుద్ధం కూడా అని తెలిపింది.
"అవగాహన కోసం నేను నా వ్యక్తిగత నిర్ణయాన్ని పంచుకోవడానికి ధైర్యం చేశాను. పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానం గురించి సరిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు కొందరు రాస్తున్నారు. ఇప్పటికైనా నా గురించి తప్పుడు వార్తలు రాయడం ఆపండి. లేకుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది" అని మెహ్రీన్ హెచ్చరించింది.
"మన వైద్యుల గురించి మనం గర్వపడాలి. అధునాతన వైద్య సదుపాయాలు మన వద్ద ఉన్నాయి. చాలా మంది ప్రజలు విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్నారు. కానీ కొందరు తక్కువ స్థాయికి దిగజారడం బాధాకరం. నాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. దాంతోపాటు నా గురించి పోస్ట్ చేసిన వార్తలను వెంటనే తొలగించాలి" అని మెహ్రీన్ డిమాండ్ చేసింది. తన ట్వీట్ లో కొన్ని మీడియా సంస్థలను కూడా ట్యాగ్ చేసింది మెహ్రీన్.