Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : ఈ అందాల్లో మీ ఫేవరెట్‌ ఏది..?

కానీ కెరీర్‌ లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పలు ఆఫర్లు చేజారడంతో పాటు కొన్ని సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

By:  Tupaki Desk   |   9 Aug 2024 11:30 AM GMT
పిక్‌ టాక్ : ఈ అందాల్లో మీ ఫేవరెట్‌ ఏది..?
X

2016 లో నాని నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో ఎక్కువ సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్‌ లో ఈ అమ్మడు పలువురు యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. ఒకానొక సమయంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా కూడా నిలిచింది. కానీ కెరీర్‌ లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పలు ఆఫర్లు చేజారడంతో పాటు కొన్ని సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి.


ఈ మధ్య కాలంలో అడపా దడపా సినిమాలు చేస్తున్న మెహ్రీన్‌ సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. రెగ్యులర్‌ గా ఈ అమ్మడు షేర్‌ చేసే అందాల ఫోటోల వల్ల వైరల్‌ అవ్వడం మాత్రమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు నటించడం ద్వారా ఎక్కువ మంది అభిమానం ను సొంతం చేసుకుంది. మరోసారి ఈ అమ్మడు సినిమాలతో బిజీ అయ్యేందుకు ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలతో సందడి చేస్తోంది.

2017 లో ఫిల్లౌరీ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నెంజిల్‌ తునివిరుందల్‌ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు కెరీర్‌ లో అనూహ్యంగా డౌన్ ఫాల్‌ మొదలయ్యింది. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మళ్లీ వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించి ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి. తాజాగా ఈ ఫోటోలను షేర్ చేసిన మెహ్రీన్‌ ఈ అందమైన ఫోటోల్లో మీ ఫేవరెట్‌ ఏది అంటూ కామెంట్‌ పెట్టింది.

జూనియర్ మిల్కీ బ్యూటీ ట్యాగ్‌ ను సొంతం చేసుకున్న మెహ్రీన్ అదే స్థాయి స్కిన్‌ టోన్‌ తో మెరిసింది. ఆకట్టుకునే అందం తన సొంతం అన్నట్లుగా ఈ ఫోటోల్లో నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్‌ షో చేసింది. ఆకట్టుకునే ఈ అమ్మడి ఫిజిక్ మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ఈ స్థాయి అందం ఉన్నా కూడా పాపం దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు, మరో పదేళ్ల పాటు ఈ అమ్మడు అందాల విందుకు రెడీగా ఉన్నా కూడా సినిమా ఆఫర్లు ఆ స్థాయిలో మాత్రం వచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆఫర్లు లేని ముద్దుగుమ్మలు వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ ఉన్నారు. మరి కొందరు ఐటెం సాంగ్స్ లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం సినిమాల్లో మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ముందు ముందు అయినా ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ చేసేందుకు ఒప్పుకోవడంతో పాటు, వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటించేందుకు అంగీకరించాలని కొందరు ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి మెహ్రీన్ సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తుందా అనేది చూడాలి.