Begin typing your search above and press return to search.

మెహ్రీన్ పాప.. బికినీలో బ్లాక్ మ్యాజిక్!

నాని హీరోగా వచ్చిన "కృష్ణగాడి వీర ప్రేమ గాధ" సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తరువాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   31 May 2024 4:33 PM GMT
మెహ్రీన్ పాప.. బికినీలో బ్లాక్ మ్యాజిక్!
X

టాలీవుడ్ లో గ్లామరస్ బ్యూటీగా మెహ్రీన్ పిర్జాదా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటి. నాని హీరోగా వచ్చిన "కృష్ణగాడి వీర ప్రేమ గాధ" సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తరువాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


మెహ్రీన్ కెరీర్‌ మొదట్లోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా నిలిచింది. అయితే, కొంతకాలంగా ఆమెకు టైమ్ అంతగా కలిసి రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ తో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. రీసెంట్ గా బ్లాక్ బికినీలో ఫోటోలకు పోజులు ఇస్తూ, వయ్యారంగా కనిపించింది. ఈ ఫోటోల్లో మెహ్రీన్ అందాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.


బీచ్ లో అలా ఎంజాయ్ చేస్తున్న అమ్మడు లెగ్స్ అందాలతో షాక్ అయ్యేలా మరో పోజు ఇచ్చింది. ఇక ఆ బికినీ పైన పువ్వు లాంటి డిజైన్ తో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఇక ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. గ్లామర్ తోనే బ్లాక్ మ్యాజిక్ చేస్తోందని అంటున్నారు ఆమె నుంచి సినిమాలు వస్తున్నా రాకపోయినా కూడా ఇలా గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూనే ఉంది.


మెహ్రీన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా "ఎఫ్-2". అందులో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది. అయితే, "ఎఫ్-3" సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో మెహ్రీన్ నటనపై ఓవర్ యాక్టింగ్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి, దాంతో క్రేజ్ కొంత తగ్గింది.


పెళ్లి విషయంలో కూడా మెహ్రీన్ కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ, పెళ్లి ముచ్చట తీరకుండానే క్యాన్సిల్ చేసుకుంది. కానీ వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి, కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మెహ్రీన్ తెలుగులో ఓ చిన్న సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్‌లో మళ్లీ తన స్థానాన్ని సాధించుకోవడానికి మెహ్రీన్ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు దొరకాలని ఆమె ఆశిస్తోంది.