Begin typing your search above and press return to search.

కొత్త హీరోతో మలి ప్రయత్నం.. అమ్మడికి కలిసి వస్తుందా..!

ప్రస్తుతం మెహ్రీన్ కొత్త హీరోతో విక్రాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. స్పార్క్ అంటూ రాబోతున్న ఈ సినిమాను విక్రాంత్ రెడ్డి నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 6:28 AM GMT
కొత్త హీరోతో మలి ప్రయత్నం.. అమ్మడికి కలిసి వస్తుందా..!
X

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ కౌర్ ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ కి దగ్గరైంది. వరుస సినిమాలు చేస్తూ అలరించిన అమ్మడు స్టార్ ఛాన్స్ లు అందుకోలేదు కానీ తన మార్క్ చూపించాలని ప్రయత్నించింది. అయితే అమ్మడి కెరీర్ పై తన ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్ బాగా పడింది. పొలిటీషియన్ భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న మెహ్రీన్ కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఆ ఎఫెక్ట్ అమ్మడి కెరీర్ మీద బాగా పడింది.

అయితే వాటి నుంచి బయట పడేందుకు అనీల్ రావిపుడి F 2, F 3 సినిమాలు వచ్చాయి. హనీ పాత్రలో మెహ్రీన్ మెప్పించినా సినిమాలు ఫలితాలు అమ్మడికి అంతగా అవకాశాలు రాబట్టలేకపోయాయి. ఇక మధ్యలో చేసిన మంచి రోజులొచ్చాయి సినిమా కూడా కలిసి రాలేదు. మారుతి ప్రభాస్ కాంబోలో వస్తున్న రాజా డీలక్స్ లో మెహ్రీన్ నటిస్తుందని కొంత ప్రచారం జరిగినా సరే వాటిల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం మెహ్రీన్ కొత్త హీరోతో విక్రాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. స్పార్క్ అంటూ రాబోతున్న ఈ సినిమాను విక్రాంత్ రెడ్డి నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారంటూ హడావిడి బాగానే చేస్తున్నారు. ఈ సినిమాతో మెహ్రీన్ తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్న తెలుగు సినిమాల్లో కెరీర్ కొనసాగించాలని ప్రయత్నిస్తున్న మెహ్రీన్ కి ఇక్కడ అవకాశాలు రావట్లేదు. మెహ్రీన్ మాత్రం టాలీవుడ్ నుంచి ఆఫర్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆల్రెడీ తనని డైరెక్ట్ చేసిన దర్శకులందరితోనూ టచ్ లో ఉంటుందని తెలుస్తుంది.

స్పార్క్ హిట్ అయితే కొంతమేరకు అమ్మడికి మార్కెట్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే స్పార్క్ లో రుక్సర్ థిల్లన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. మెహ్రీన్ కౌర్ పాత్ర మెయిన్ లీడ్ కాగా రుక్సర్ సెకండ్ హీరోయిన్ గా ఉంటుందని టాక్. ఈ సినిమా మీద మెహ్రీన్ చాలా హోప్స్ పెట్టుకుంది. మెహ్రీన్ కౌర్ అనుకున్న రేంజ్ లో స్పార్క్ సక్సెస్ సాధిస్తుందా సినిమాతో అమ్మడు ఫాం లోకి వస్తుందా అన్నది చూడాలి. లాస్ట్ ఇయర్ ఎఫ్ 3 తర్వాత మళ్లీ ఏడాదికి స్పార్క్ ఛాన్స్ అందుకున్న మెహ్రీన్ దీనితో పాటుగా నీ సిగూవరెగు సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇస్తుంది.