మెహరీన్ మళ్లీ మత్తెక్కించే బ్యూటీతో!
ఇదిగో ఇక్కడున్న ఫోటోని చూస్తే ఆ వ్యత్యాసం ఏంటి? అన్నది స్పష్టంగా అర్ధమవుతుంది.
By: Tupaki Desk | 21 March 2024 10:20 AM GMTహాట్ బ్యూటీగా ఫేమస్ అయిన మెహరీన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభంలో అమ్మడు బొద్దు అందంతోనే బోలెడంత పాపులారిటీ దక్కించుకుంది. అటుపై కొన్నాళ్లకి సన్నజాజి సోయగంలా మారిపోయి కొత్త అనుభూతిని పంచింది. ఈ రెండు దశల్లోనూ మెహరీన్ తెలివిగా సక్సెస్ అయింది. చబ్బీ లుక్ నుంచి స్లిమ్ లుక్ లోకి మారేసరికి ఇమేజ్ పై ప్రభావం పడుతుందని భావించింది గానీ అలా జరగ లేదు. తాజాగా అమ్మడు ఆ రెండు లుక్ ల్ని బ్యాలెన్స్ చేస్తూ ఓ ఫోటోని మార్కెట్ లోకి వదిలింది.
ఇదిగో ఇక్కడున్న ఫోటోని చూస్తే ఆ వ్యత్యాసం ఏంటి? అన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. మెహరీన్ ఈ పిక్ లో మరీ చబ్బీ లుక్ లో కాకుండా...టూమచ్ గా సన్నగాను కూకుండా మీడియం లుక్ ని మెయింటెన్ చేసింది. చిట్టిపొట్టి దుస్తుల్లో మెహరీన్ ముస్తాబైన విధానం ఆకర్షిస్తుంది. నుదిటిన ముత్యాల పాపిడి బొట్టు.. జెడని సైత అదే డిజైన్ తో ఎంతో అందంగా మలిచింది. డ్రెస్ ని మ్యాచ్ చేస్తూ చేతికి ధరించిన గాజులు అంతే అందంగా కనిపిస్తున్నాయి.
చెవులకు పెట్టిన దిద్దులు ప్రతీది మెహరీన్ ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మెహరీన్ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. లుక్స్ ప్రెట్టీ అంటూ పొగిడేస్తున్నారు. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే సినిమాల జోరు తగ్గిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం వరకూ స్పీడ్ గా సినిమాలు చేసిన అమ్మడు ఇప్పుడంత వేగంగా చేయడం లేదు.
ఈ మూడేళ్ల కాలంలో కేవలం ఏడాదికి ఒకటి చోప్పున ఒక సినిమానే చేసింది. అందులో `ఎఫ్ -3` తప్ప మిగిలిన రెండు చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. స్పార్క్ లైఫ్...మంచి రోజులే సినిమాలు డిజాస్టర్లగా తేలాయి. ప్రస్తుతం తెలుగులో అవకాశాలేవు. తమిళ్ లోనూ ఛాన్సులు కనిపించలేదు. కన్నడలో మాత్రం ఓ సినిమా చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ కూడా డిలే అవుతుంది.