ఆ మార్ఫింగ్ వీడియో వల్ల మెంటల్ టార్చర్..!
ఫోన్స్ లో కూడా మార్ఫింగ్ వీడియోలు మరియు ఫోటోలు తయారు చేసే యాప్స్ రావడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
By: Tupaki Desk | 20 Dec 2023 6:02 AM GMTసోషల్ మీడియాలో పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని ఇష్టానుసారంగా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారు తయారు అయ్యారు. ఫోన్స్ లో కూడా మార్ఫింగ్ వీడియోలు మరియు ఫోటోలు తయారు చేసే యాప్స్ రావడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సెలబ్రెటీలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తూ శునకానందం కు పాల్పడుతున్నారు.
టీవీ సీరియల్స్ మరియు జబర్దస్త్ ఇతర ఈటీవీ కార్యక్రమాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న రీతూ చౌదరి వీడియో ఒకటి కొన్నాళ్ల క్రితం వైరల్ అయింది. ఆ వీడియో విషయం లో రీతూ మొదట లైట్ తీసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో ను ఇంకా కూడా కొంత మంది షేర్ చేస్తూ ఉండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రీతూ చౌదరి తన మార్ఫింగ్ వీడియో పై ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేసినట్లుగా ఆమె పేర్కొంది. ఒక వీడియోను విడుదల చేసి ఆమె తన పరిస్థితిని మరియు తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు గురించి కూడా అందులో తెలియజేసింది.
ఆ వీడియో లో రీతూ చౌదరి మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం నా వీడియో అంటూ ఒక మార్ఫింగ్ వీడియోను షేర్ చేసి నన్ను ట్యాగ్ చేసి కొంత మంది సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఆ వీడియో తో మెంటల్ టార్చర్ అనుభవించాను. నా కుటుంబ సభ్యులు, నా బాయ్ ఫ్రెండ్ ఇంకా ఇండస్ట్రీకి చెందిన కొందరు నాకు మద్దతుగా నిలిచారు.
చాలా ఆలోచించిన తర్వాత ఆ వీడియో పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేను ఏ వీడియో పెట్టినా, పోస్ట్ పెట్టినా కూడా కొందరు తీవ్రమైన పదజాలంతో కామెంట్స్ చేస్తున్నారు. వారందరిపై కూడా కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. నా పై అసభ్యకరంగా కామెంట్స్ చేసిన వ్యక్తి తరపు వారు చిన్న పిల్లాడు క్షమించు వదిలేయమని మాట్లాడుతున్నారు.
సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా సెలబ్రిటీలను కామెంట్స్ చేసే వారిని వదిలి పెట్టాలా అంటూ రీతూ వర్మ ప్రశ్నించింది. ఇటీవల రీతూ వర్మ తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసింది. ఆ వీడియో కు కూడా చాలా మంది అసభ్యకరంగా కామెంట్స్ చేశారట. వారిపై కూడా ఫిర్యాదు చేస్తానంటూ రీతూ వర్మ హెచ్చరించింది. రీతూ కు మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది.