అమ్మ వారి పక్కనే పోర్న్ స్టార్ ఫోటో..ఇదేం పైత్యం!
ఏకంగా మాజీ పోర్న్ స్టార్న్ స్టార్ ఫోటో వేసుకుని మరీ ఆ వేడుకను ప్రచారం చేసుకునే పైత్యానికి ఒడిగట్టారు.
By: Tupaki Desk | 9 Aug 2024 10:26 AM GMTపండగొచచినా...పబ్బం వచ్చినా ఇప్పుడు ప్రచారం ఏ రేంజ్ లో జరుగుతుందో? చెప్పాల్సిన పనిలేదు. గ్రామాల్లో యువత అంతా ఏకమై తమ అభిమాన హీరో ఫోటో పెట్టుకోవడం లేదా రాజకీయ నాయకుడి ఫోటో వేసుకోవడం చూసి ఉంటాం. కానీ అభిమాన పోర్న్ స్టార్ ఫోటో పెట్టుకుని ఫోటోలు వేసుకోవడం.. ఆ పక్కనే గ్రామ దేవత ఫోటో వేసుకోవడం ఎప్పుడైనా చూసారా? అంటే ఇంతవరకూ అలాంటి బాపతు ఎక్కడా చూసి ఉండారు.
ఇప్పుడు అలాంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏకంగా మాజీ పోర్న్ స్టార్న్ స్టార్ ఫోటో వేసుకుని మరీ ఆ వేడుకను ప్రచారం చేసుకునే పైత్యానికి ఒడిగట్టారు. ఫలితంగా వివాదాస్ప దంగానూ మారింది. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడు కాంచీపురం జిల్లా కురువిమలై ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. శ్రీమాప్పిళ్లై వినాయగర్ ఆలయంలో అమ్మవారి కల్యాణోత్సవ వేడుకల సందర్భంగా ప్లెక్స్ వేసి దానిపై అమెరికన్ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీపా ఫోటో వేయడం చేయడం చర్చనీయాంశంగా మారింది.
దీన్ని చూసిన స్థానికులు, నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అమ్మవారి పండుగగు కుర్రాళ్లు ఇలా స్వాగతం పలుకుతారా? మన దేశం ఎటు పోతుంది? గ్రామస్తులు ఏం చేస్తున్నారు? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజనులు మండిపడుతున్నారు. కావాలనే ఇలా చేశారని పలువురు అంటుండగా, అలా చేయలేదని మరికొంత మంది అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీ విషయం తెలిసిన పోలీసులు దానిని తొలగించాలని ఆదేశించారు.
ఆది ఉత్సవ్ రోజున ప్రజలు నాడి కథవర్ను పూజించి వారి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లి అమ్మన్ ఆలయాల్లో వివిధ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ లైటింగ్, హోర్డింగ్లు ఏర్పాటు చేసి ప్రజలను ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్కి- మియా ఖలీఫా ఫోటోకు ఎటువంటి సంబంధం లేదు. తొలుత ఈ ఫోటో చూసి మియా ఖలీపా పండగకి ముఖ్య అతిధిగా విచ్చేస్తుందా? అని తెలియనివారు ఆశ్చర్య పోయారు. కానీ ఆమె గురించి అసలు విషయం తెలిసే సరికి షాక్ అయ్యారు.