మైఖేల్ జాక్సన్ ఉత్తరప్రదేశ్‌లో కచేరీ చేసి ఉంటే!
మాషప్‌లు, రీమిక్స్ లు, ఇమ్మిటేషన్లతో కడుపుబ్బా నవ్వించే స్కిట్ లు డ్యాన్సులతో ఫన్ క్రియేట్ చేయడంలో మన క్రియేటర్ల తర్వాతే ఎవరైనా
By: Tupaki Desk | 29 Jun 2024 2:45 AM GMTమాషప్‌లు, రీమిక్స్ లు, ఇమ్మిటేషన్లతో కడుపుబ్బా నవ్వించే స్కిట్ లు డ్యాన్సులతో ఫన్ క్రియేట్ చేయడంలో మన క్రియేటర్ల తర్వాతే ఎవరైనా. ఇప్పుడు అదే తీరుగా ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ `పంచాయత్ 3`(వెబ్ సిరీస్) బీట్‌కి డ్యాన్స్ చేయడంతో అంతర్జాలంలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ లో దుమ్ము రేపుతోంది. ``మైఖేల్ జాక్సన్ ఉత్తరప్రదేశ్‌లో కచేరీ చేసి ఉంటే!`` అనే శీర్షికతో తెలివిగా ఎడిట్ చేసిన ఈ వీడియో పాపులర్ హిందీ వెబ్ సిరీస్ `పంచాయత్ 3` లోని పాటకు ఇమ్మిటేషన్. కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ స్టెప్పులు ఈ పాటకు యాప్ట్ అవ్వడం ఆశ్చర్యపరిచింది. ఇది నిజంగా ఎడిటర్ అసాధారణ సృజనాత్మకతకు అద్దం పట్టిందని ప్రశంసించాలి.
ఈ క్లిప్ లో ఐకానిక్ మైఖేల్ జాక్సన్ బ్లాక్ జాకెట్, ప్యాంట్‌లో స్టైలిష్ గా డ్యాన్సులు చేస్తూ కనిపించగా, మ్యూజిక్ ని రీమిక్స్ చేసిన తీరు ఆకట్టుకుంది. పాప్ బీట్ నుండి తబలా హార్మోనియంకు మారి బీట్ ఎంతో స్పష్ఠంగా వినిపించింది. వెబ్ సిరీస్ `పంచాయత్ 3` పాటల జాబితా నుండి మైఖేల్ జాక్సన్ పాటకు సూటయ్యే ఒక పాటను ఎంపిక చేయడం దానిని ఎడిట్ చేసి వైరల్ చేయడం తెలివైన ప్రణాళిక. మైఖేల్ జాక్సన్ తనవైన సిగ్నేచర్ స్టెప్స్ తో అగ్గి రాజేసిన ఈ డ్యాన్స్ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో పంచాయత్ సిరీస్ కి కావాల్సినంత పబ్లిసిటీ దక్కుతోంది. నిజంగా ఈ వీడియో కోసం తబలా - హార్మోనియంలను ఈ బీట్ కోసం ఉపయోగించిన తీరుకు ఎడిటర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ ఎడిటెడ్ వీడియోని సచిన్ షిర్సాట్ అనే నెటిజన్ షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇది ఇన్‌స్టాలో 8 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. చాలా మంది వినియోగదారులు దీనిని మాస్టర్ పీస్ అని ప్రశంసించారు. నువ్వు చూస్తున్నావా, బినోద్? మైఖేల్ జాక్సన్ రాజాజీ పాటకు డ్యాన్స్ ఎలా చేస్తున్నారో? అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇది చాలా అద్భుతంగా కుదిరింది అని మరొకరు ప్రశంసించారు. మైఖేల్ జాక్సన్ చాలా మంచివాడు, అతడు ఇతర భాషలలో కూడా చంపుతున్నాడు! అని మూడవ వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించారు.
మైఖేల్ జాక్సన్ పాప్ సామ్రాజ్యపు రారాజుగా ఏలారు. ఆయన మరణించినా కానీ తన పాటలు, డ్యాన్సులు నేటితరానికి ఎనర్జీ బూస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఈ పాటల నుంచి స్ఫూర్తి పొంది ఎందరో డ్యాన్సర్లు పుట్టుకొచ్చారు. ప్రపంచంలోని ఎందరో కొరియోగ్రాఫర్లు తమను తాము తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ ల ప్రచారానికి కూడా మైఖేల్ జాక్సన్ పాటలు ఉపయోగపడటం ఆశ్చర్యపరుస్తోంది.