ఏం కావాలో క్లారిటీ లేని డైరెక్టర్‌తో నరకం
టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి
By: Tupaki Desk | 17 Aug 2024 11:30 PM GMTటాలీవుడ్ లో మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. సంగీత దర్శకుల నుంచి క్లారిటీగా తమకు ఏం కావాలో తీసుకోగల సమర్థులు. సినిమాలు హిట్టయినా ఫ్లాపయినా వీళ్లతో పని చేసిన సంగీత దర్శకులకు పేరొస్తుంది. ఎన్నో విమర్శలున్న థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో `బిజినెస్‌మేన్`కి అద్భుతమైన మ్యూజిక్ తీసుకున్నారు పూరి. ఆర్య, ఆర్య 2, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ ని తీసుకున్న సుకుమార్ మ్యూజిక్ సెన్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో క్లాసిక్ మెలోడీ పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సంగీతం, సాహిత్యం రెండిటికీ అతడి సినిమాల్లో ప్రాధాన్యత ఉంటుంది.
అయితే వీళ్లలా క్లారిటీగా ఇతర డైరెక్టర్లు అందరూ మ్యూజిక్ తీసుకుంటారని భావిస్తే తప్పులో అడుగేసినట్టే. కొన్ని సినిమాల్లో ఒకే తరహా భజంత్రీ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ఎక్కడో వినేసినట్టే ఉంది అని కూడా అనిపిస్తుంది. వినిపించినవే వింటున్నాం అని ఆడియెన్ అనుకుంటే, అది కచ్ఛితంగా ఆ దర్శకుడి ఫాల్టే. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమాకి మాస్ పాటలు అందించిన మిక్కీ జే మేయర్ తనతో పని చేసిన ఒక దర్శకుడి గురించి ఊహించని కామెంట్ చేసారు. అతడితో పని చేయడం టార్చర్ అనేశాడు!
అతడు ఎవరు? అన్నది అప్రస్తుతం. కానీ ఆ డైరెక్టర్ కి అసలు ఏం కావాలో క్లారిటీ లేకపోవడంతో తాను నరకం చూసానని మిక్కీ జే అన్నారు. తాను ఏది చేసిన బాలేదని నిర్మొహమాటంగా చెప్పేసేవాడట. చివరికి తనకు మ్యూజిక్ రాదని డిప్రెషన్ లోకి వెళ్లిపోవడమే కాదు.. ఐటీ జాబ్ లోకి తిరిగి వెళ్లిపోదామని అనుకున్నారట మిక్కీ జే. కానీ ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సినిమాని ఏదోలా పూర్తి చేసేసాడు. అంతగా మ్యూజిక్ సెన్స్ లేని డైరెక్టర్స్ తో పని చేయడం నరకం అని మిక్కీ జే అన్నారు. ఏదైనా సినిమాకి సంగీతం సగం బలం అని అంటారు. దానిపై క్లారిటీ లేని డైరెక్టర్ కి హిట్టు దక్కడం అంత సులువు కాదు! మిక్కీ జేని టార్చర్ పెట్టిన సెన్స్ లెస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరై ఉంటారు? అంటూ ఇప్పుడు ఆరాలు మొదలయ్యాయి.