Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ… అతను ఎందుకు వదులుకున్నాడు?

ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట అవకాశం వచ్చింది మిక్కీ జె మియర్ కి అని అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 July 2024 2:07 PM GMT
కల్కి 2898ఏడీ… అతను ఎందుకు వదులుకున్నాడు?
X

నాగ్ అశ్విన్ అద్భుత సృష్టి కల్కి 2898ఏడీ వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది. అలాగే డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా కలిసి 2898ఏడీ చిత్రం నిలవడం విశేషం. తెలుగు బాక్సాఫీస్ కి కూడా ఈ ఏడాది కల్కి మూవీ చాలా ఊరటనిచ్చిందని చెప్పాలి. ఈ ఏడాది ప్రదమర్థంలో వంద సినిమాలు వరకు రిలీజ్ అయిన కేవలం రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యాయి.

దీంతో థియేటర్స్ యజమానులు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికి కల్కి మూవీ కాస్త భరోసాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట అవకాశం వచ్చింది మిక్కీ జె మియర్ కి అని అందరికి తెలిసిందే. నాగ్ అశ్విన్ మహానటి సినిమాకి కూడా మిక్కి జె మియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అందుకే కల్కి 2898ఏడీ సినిమా ఛాన్స్ కూడా నాగ్ అశ్విన్ అతనికే ఇచ్చారు. మిక్కీ జె మియర్ ఈ సినిమాకి సంగీతం అందించడానికి రెడీ అయ్యారు.

తర్వాత ఏవో కారణాలతో తప్పుకున్నారనే టాక్ బయటకు వచ్చింది. దీంతో ఆ స్థానంలోకి సంతోష్ నారాయణన్ వచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఎలివేట్ అయ్యింది. దానికి కారణం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అని చెప్పొచ్చు. అయితే ఇంత అద్భుత అవకాశాన్ని మిక్కీ జే మియర్ ఎందుకు వదిలేసుకున్నాడు అనే ప్రశ్న చాలా రోజుల నుంచి వినిపిస్తోంది

మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మియర్ పేరు ఉంది. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలలో ఆయన భాగమయ్యారు అయితే మిక్కీ జె మియర్ కల్కి సినిమా వదులుకోవడానికి కారణం ఇదే అంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. కల్కి 2898ఏడీ మూవీ చేస్తున్న సమయానికి మిక్కీ జె మియర్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే కల్కి చిత్ర యూనిట్ అతనిని మ్యూజిక్ కోసం ఎక్కువ సమయం కావాలని అడిగిందంట. రెమ్యూనరేషన్ మాత్రం ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారమే ఇస్తామని చెప్పారంట. దీంతో ఆల్ రెడీ చేతిలో ఉన్న అవకాశాలు వదులుకోలేక కల్కి ఆఫర్ ని మిక్కీ సున్నితంగా తిరస్కరించారంట.

ఈ సమయంలో మిక్కీ రామబాణం, గాండీవ దారి అర్జున, పెదకాపు 1, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలేవి కూడా సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాకి అదిరిపోయే మాస్ ట్యూన్స్ మిక్కీ అందించారు. ఇప్పటికే ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో సక్సెస్ అందుకొని మరల బౌన్స్ బ్యాక్ అవుతాననే కాన్ఫిడెన్స్ తో మిక్కీ జె మియర్ ఉన్నారని తెలుస్తోంది.