హీరోయిన్ 'కర్మ' అనుభవిస్తోందన్న నిర్మాత
డబ్బు ఉన్నంత మాత్రాన సినిమాలు తీయలేరు. నిర్మాత అంటే 24 శాఖలపైనా అవగాహన ఉండాలి. ప్రతిదీ అనుభవపూర్వకంగా మ్యానేజ్ చేయగలగాలి.
By: Tupaki Desk | 2 March 2025 9:30 PM GMTడబ్బు ఉన్నంత మాత్రాన సినిమాలు తీయలేరు. నిర్మాత అంటే 24 శాఖలపైనా అవగాహన ఉండాలి. ప్రతిదీ అనుభవపూర్వకంగా మ్యానేజ్ చేయగలగాలి. మానవ వనరులతో పాటు, ఆర్థిక వనరుల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. అన్ని విభాగాలపై నాలెజ్ తప్పనిసరి. అందుకే మొదటిసారి సినిమా నిర్మాణంలో ప్రవేశించే నిర్మాతలకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా నిలబడి పోరాడి చివరికి సినిమాని రిలీజ్ చేయాలి. కానీ గాయకుడు మిల్కాసింగ్ నిర్మాతగా ఆరంభమే పెద్ద దెబ్బ తిన్నానని చెప్పాడు. ముఖ్యంగా హీరోయిన్ బిపాసా బసు కారణంగా తాను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తిన్నానని వాపోయాడు.
బిపాసా.. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి `డేంజరస్ షో` అనే చిత్రంలో కనిపించింది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టును మికా సింగ్ నిర్మించారు. అయితే సినిమా షూటింగ్ జరిగేప్పుడు బిపాసా బసు నిర్మాతను చాలా ఇబ్బందులు గురి చేసింది. ఖరీదైన హోటల్ రూమ్స్ లో బస ఏర్పాటు చేసినా భార్యా భర్తలు ఇద్దరికీ సపరేట్ రూమ్ లు కావాలని కోరేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పింక్‌విల్లా ఇంటర్వ్యూలో మికాసింగ్ మాట్లాడుతూ బిపాసాకు ఇప్పుడు పని లేదని సైలెంట్ గా సెటైర్ వేసాడు.``వారు ఇప్పుడు పనిలో లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు`` అని కర్మ ప్రిన్సిపల్ ని ఉదహరిస్తూ బిపాసాను దెప్పి పొడిచాడు.
తాను కరణ్ సింగ్ గ్రోవర్‌తో సిరీస్‌ను నిర్మించాలని .. వేరే హీరోయిన్‌ను తీసుకోవాలని మొదట అనుకున్నానని, కానీ బిపాసా బసు దానిలో భాగం కావాలని కోరుకుందని మికా సింగ్ వెల్లడించాడు. లండన్ లో సినిమాని చిత్రీకరించాం. బడ్జెట్ రూ. 4 కోట్ల నుండి రూ. 14 కోట్లకు పెరిగింది. బిపాసా సృష్టించిన డ్రామాతో సినీనిర్మాత అయినందుకు ఎప్పుడూ చింతిస్తున్నానని మికా అన్నాడు. బిపాసా ముద్దు సన్నివేశం చేయడానికి నిరాకరించిన వైనం గురించి చెప్పుకుని బాధపడ్డాడు. ``ఇది భార్యాభర్తల చిత్రం కాబట్టి స్పష్టంగా ముద్దు సన్నివేశం ఉంటుంది. దర్శకుడు రచయిత ఇప్పటికే దీన్ని ప్లాన్ చేశారు. కానీ బిపాసా చివరి నిమిషంలో నిరాకరించారు`` అని అతను చెప్పాడు.
కరణ్ - బిపాషాకు చెల్లించాల్సిన సొమ్ముల విషయంలో ఎలాంటి తేడాలు చేయలేదని, కానీ డబ్బింగ్ ప్రక్రియను పూర్తి చేయడం కూడా అంత సులభం కాదని మికా సింగ్ స్పష్టం చేశాడు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఎప్పుడూ గొంతు నొప్పి ఉండేది. ఒకసారి బిపాషా అనారోగ్యంతో ఉంటే, మరొకసారి కరణ్ అనారోగ్యంతో ఉండేవాడు! అని తెలిపాడు.
పెద్ద నిర్మాతలనే కాదు చిన్న నిర్మాతలను కూడా గౌరవించాలని బిపాసా- కరణ్ జంటకు అతడు పరోక్షంగా సూచించాడు. కొంతమంది పనిలో లేని హీరోయిన్లు తమ దురదృష్టం అనుకునే సమయంలో అవకాశం ఇచ్చే నిర్మాతలను వారు గౌరవించాలి. నిర్మాతే మీ దేవుడు. వారు ధర్మ ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ చేసే చిత్రంలో చిన్న పాత్రలు పోషించడంలో సంతోషంగా ఉండవచ్చు. కానీ అదే మొత్తంలో డబ్బు చెల్లించే చిన్న నిర్మాతలను గౌరవించరు అని మికా సింగ్ అన్నారు. శుభ హోనే నా దే, మస్త్ కలందర్, పార్టీతో బంతి హై, హీర్‌తో బాడి సద్ హై వంటి హిట్ పాటలతో మికాసింగ్ ప్రజల్లో పాపులరయ్యారు.