Begin typing your search above and press return to search.

స్టార్ సింగ‌ర్‌కి ఎందుకింత లేటుగా?

త‌న‌ ఎనిమిదవ స్టూడియో ఆల్బమ్ 'ఎండ్‌లెస్ సమ్మర్ వెకేషన్'లో ఇది ప్రధాన సింగిల్. ఆదివారం నాటి వేడుక లో మిలీ సైరస్‌కు.. మరియా కేరీ ఈ అవార్డును అందజేశారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 10:06 AM GMT
స్టార్ సింగ‌ర్‌కి ఎందుకింత లేటుగా?
X

ద‌శాబ్ధం పైగా కెరీర్ లో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు పాడిన పాప్ గాయ‌ని మిలీ సైర‌స్ ఇన్నేళ్ల‌లో ఒక్క గ్రామీ కూడా అందుకోలేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. కానీ ఎట్ట‌కేల‌కు 'ఫ్ల‌వ‌ర్స్' పాట‌కు గాను 31 ఏళ్ల మిలీ కెరీర్‌లో మొదటి గ్రామీ అవార్డును గెలుచుకుంది. త‌న‌ ఎనిమిదవ స్టూడియో ఆల్బమ్ 'ఎండ్‌లెస్ సమ్మర్ వెకేషన్'లో ఇది ప్రధాన సింగిల్. ఆదివారం నాటి వేడుక లో మిలీ సైరస్‌కు.. మరియా కేరీ ఈ అవార్డును అందజేశారు.

మిలీ సైరస్ సీతాకోకచిలుకను పట్టుకోవడానికి పోరాడుతున్న ఒక చిన్న పిల్లవాడి కథను ఈ పాట‌లో వివ‌రించింది. అతడు ఎప్పటికీ సీతాకోక‌ను పట్టుకోలేడనే వాస్తవాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ఒక సీతాకోకచిలుక వచ్చి అతడి ముక్కు కొనపై దిగుతుంది.. ఇలాంటి ఒక అద్భుత‌మైన థీమ్ ని ఎంపిక చేసుకున్న మిలీ ఈసారి ప్ర‌తిష్ఠాత్మ‌క గ్రామీని గెలుచుకోగ‌లిగింది. ఈ పాట 'ఫ్లవర్స్- నా సీతాకోకచిలుక' అని మిలీ సైరస్ వ్యాఖ్యానించారు. ''నేను ట్రాఫిక్‌లో వర్షంలో చిక్కుకున్నాను..యు నేను ఈ క్షణాన్ని కోల్పోతానని అనుకున్నాను'' అని మిలీసైరస్ అవార్డు గెలుచుకున్న వేళ ఎమోష‌న‌ల్ గా చెప్పారు. ''నేను అవార్డును కోల్పోవచ్చు.. కానీ అది మంచిది.. కానీ మరియా కారీ అలా కాదు!'' అని హోస్ట్ ని పొగిడేసింది.

ఈ అవార్డు అద్భుతమైనది.. కానీ నా జీవితం నిన్న అందంగా ఉన్నందున ఇది దేనినీ మార్చదని నేను నిజంగా ఆశిస్తున్నాను! అని త‌న ఒదిగి ఉండే స్వ‌భావాన్ని మిలీ వేదిక‌పై ఆవిష్క‌రించింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గ్రామీని పొందలేరు.. కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అద్భుతమైనవారు.. కాబట్టి దయచేసి ఇది ముఖ్యమైనదని అనుకోకండి.. అని కూడా మిలీ అంది.

Pic credit : British Vogue