Begin typing your search above and press return to search.

'మిరాయ్' తేజ సజ్జా.. ప్రమాదంలో ఇలా..

ఇప్పుడు ఈ న్యూ పోస్టర్ సినిమా పట్ల మరింత ఆసక్తిని కలిగిస్తుంది. కార్తీక్ గట్టమనేని డైరెక్టర్ గానే కాకుండా సినిమాటోగ్రఫీ తోపాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 6:30 AM GMT
మిరాయ్ తేజ సజ్జా.. ప్రమాదంలో ఇలా..
X

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్‌ను అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా చిత్రం మిరాయ్ తో రెడీ అవుతున్నాడు. హనుమాన్ లో సరికొత్తగా కనిపించిన తేజ ఇప్పుడు ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో సూపర్ యోధా పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌లో తేజ సజ్జా ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తనను తాను రక్షించుకుంటూ జ్వలించే ఇనుప రాడ్ ను పట్టుకుని కనిపిస్తున్నారు. వాయు వేగంతో వస్తున్న వస్తువుల నుండి కాపాడుకుంటున్న ఈ సన్నివేశం తేజ పాత్ర ధైర్యాన్ని హైలైట్ చేస్తుంది.

పోస్టర్‌లో కనిపిస్తున్న పాత ఆలయం కూడా మిస్టరీ తో కూడిన ప్రదేశాన్ని సూచిస్తోంది. ఈ పోస్టర్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి గొప్ప అనుభూతిని ఇస్తుందని, అలాగే సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుందని చెప్పవచ్చు. తేజ సజ్జా ఈ సినిమాకోసం ఎంత శ్రమిస్తున్నారో, ఈ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. దర్శకుడు కార్తీక్ గట్టమనేని ప్రతిష్టాత్మకంగా క్రియేట్ చేస్తున్న కొత్త ప్రపంచం ఈ పోస్టర్ ద్వారా మరింత హైలెట్ అయ్యింది.

ఈ పాన్ ఇండియా చిత్రం ఏకంగా 8 భాషల్లో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. 2025 ఏప్రిల్ 18న సమ్మర్ స్పెషల్ గా 2D మరియు 3D ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే, తేజ సజ్జా మరియు మనోజ్ మంచు క్యారెక్టర్లను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకున్నాయి.

ఇప్పుడు ఈ న్యూ పోస్టర్ సినిమా పట్ల మరింత ఆసక్తిని కలిగిస్తుంది. కార్తీక్ గట్టమనేని డైరెక్టర్ గానే కాకుండా సినిమాటోగ్రఫీ తోపాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. డైలాగ్స్ మణిబాబు కరణం అందించారు. గౌర హరి సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు.