హర్రర్ 'మిరల్' అసలు కథ ఇదే..!
మొన్నటి వరకు ఎన్నికల హడావుడి, మరో వైపు ఐపీఎల్ కారణంగా టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాల విడుదల అనేది లేకుండా పోయింది
By: Tupaki Desk | 19 May 2024 4:55 AM GMTమొన్నటి వరకు ఎన్నికల హడావుడి, మరో వైపు ఐపీఎల్ కారణంగా టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాల విడుదల అనేది లేకుండా పోయింది. వచ్చే వారం నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల సందడి మళ్లీ షురూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లోపు కొన్ని తమిళ ఇంకా ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
తెలుగు సినిమాలు లేని సమయంలో వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో అరవ సినిమా 'మిరల్' ఒకటి. రెండేళ్ల క్రితమే వచ్చిన ఈ సినిమాను అప్పట్లోనే డబ్ చేసి విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు తెలుగు సినిమాలు లేక పోవడంతో డబ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమిస్తే సినిమాతో సుపరిచితుడిగా మారిన భరత్ హీరోగా వాణి భోజన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి కాన్సెప్ట్ మూవీలు తెలుగు లో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వదిలారు.
ఈ మధ్య వస్తున్న హర్రర్ కామెడీ సినిమాల మాదిరిగా కాకుండా ఓన్లీ హర్రర్ తో ఈ సినిమాను దర్శకుడు శక్తివేల్ రూపొందించాడు. చిన్న స్టోరీ లైన్ ను సాగతీసేందుకు ప్రయత్నించాడు. పాయింట్ రొటీన్ గా ఉన్నా స్క్రీన్ ప్లే తో దాన్ని మేనేజ్ చేసే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు ఆ దిశలో సఫలం కాలేక పోయాడు.
ఒక ఫ్యామిలీ దెయ్యాలు పగ పట్టడం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. అయితే సినిమా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లేక పోవడంతో అసలు టాక్ రాలేదు. పైగా ఇదే డబ్బింగ్ వర్షన్ ఆన్ లైన్ లో కూడా ఉంది. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లి ఏం చూస్తాం అన్నట్టు కొందరు అటు వైపు కూడా చూడటం లేదు.
టైమ్ పాస్ కి అయినా వెళ్దాం అనుకున్న వారు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ఒకటి రెండు రోజులకే పరిమితం అయిన మిరల్ సినిమా రిలీజ్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకు వచ్చిందా అంటే డౌటే అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.