Begin typing your search above and press return to search.

మీర్జాపూర్ 3.. జెట్ స్పీడ్ లో ట్రెండింగ్ షురూ

ఓటీటీ వెబ్ సిరీస్ లో అత్యధిక మంది వీక్షించిన కంటెంట్ లలో మీర్జాపూర్ సిరీస్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 July 2024 5:09 AM GMT
మీర్జాపూర్ 3.. జెట్ స్పీడ్ లో ట్రెండింగ్ షురూ
X

ఓటీటీ వెబ్ సిరీస్ లో అత్యధిక మంది వీక్షించిన కంటెంట్ లలో మీర్జాపూర్ సిరీస్ ఉంటుంది. మీర్జాపూర్ సిటీ బ్యాక్ డ్రాప్ మాఫియా గొడవలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో మీర్జాపూర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో కాస్తా బూతులు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయిన వాటిని పబ్లిక్ కూడా ఇంట్రస్ట్ గా వీక్షించారు.

అందుకే మీర్జాపూర్ సీజన్ 3ని కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇండియా నుంచి వచ్చిన వెబ్ సిరీస్ లో కంప్లీట్ కల్ట్ కంటెంట్ తో మీర్జాపూర్ ట్రెండ్ సెట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన మీర్జాపూర్ 3కి అద్భుతమైన స్పందన వస్తోంది. రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోనే ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా మీర్జాపూర్ 3 నిలిచింది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

180+ దేశాల ప్రజలు ఈ మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ని వీక్షిస్తూ ఉండగా 83 దేశాలలో టాప్ 10 ట్రెండింగ్ లో ఉందని తెలియజేశారు. మొదటి, రెండు సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ 3 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అయితే ఈ మీర్జాపూర్ సిరీస్ కి ఉన్న సక్సెస్ ట్రాక్ కారణంగా మీర్జాపూర్ 3ని కూడా అత్యధిక మంది వీక్షించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా నడవడంతో సీజన్ 4 షూటింగ్ కి కూడా స్టార్ట్ చేసేశారంట. దీనిని వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా భాషలలో ఈ మీర్జాపూర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కంటెంట్ అన్ని ప్రాంతాలకి రిలేట్ అయ్యే విధంగా ఉండటంతో పాటు, రియలిస్టిక్ గా సంభాషణలు ఉండటం వలన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఈ మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో నటించిన యాక్టర్స్ కి కూడా స్టార్ ఇమేజ్ వచ్చింది. బోల్డ్ కంటెంట్ అయిన కూడా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండటంతో ఇదే తరహాలో సీజన్ 4ని కూడా రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి మీర్జాపూర్ సీజన్ 3 లాంగ్ రన్ లో ఇండియన్ వెబ్ సిరీస్ ల పరంగా అత్యధిక వ్యువర్ షిప్స్ రికార్డ్స్ ని ఏ స్థాయిలో క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.